AP Rains | ఏపీలో కుండపోత వర్షాలు.. 16 జిల్లాలకు బిగ్ అలర్ట్!
AP Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. తీరానికి వాయవ్యంగా 40కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు మూడు కి.మీ.వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య పూరీకి సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
AP Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. తీరానికి వాయవ్యంగా 40కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు మూడు కి.మీ.వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య పూరీకి సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, ఓడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతున్నది. వాయుగుండం కారణంగా కుండపోతగా వర్షాలు కురవడంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జలశయాలు నిండిపోతున్నాయి. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో వివిధ జిల్లాల్లోని వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాల్లో గోదావరికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజి దగ్గర వరద పెరగడంతో సముద్రంలోకి 3,10,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం 10.44 అడుగులుగా ఉంది. భారీ వర్షాల కారణంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజికి భారీగా వరద పోటెత్తింది. దీంతో బ్యారేజి నుంచి కాల్వల ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విశాఖ, అనకాపల్లిలో భారీ వర్షాల కురుస్తున్న కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

