Dhavaleswaram | ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉధృతి
Dhavaleswaram | ఏపీలోని ధవళేశ్వరం (Dhavaleswaram ) బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది.
అమరావతి : ఏపీలోని ధవళేశ్వరం (Dhavaleswaram ) బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగి రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద (Flood) ప్రవాహం మాత్రం గోదావరిలో కొనసాగుతుంది.
మరోవైపు పోలవరం (Polavaram) ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ వైపు వస్తుండడంతో బ్యారేజీ వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరింది. 17.75 అడుగులకు నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. బ్యారేజీ నుంచి 16.20లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వరద ఉధృతి పెరగడం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాలల్లో పలు గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కోనసిమ జిల్లా పరిధిలోని నదీ పరీవాహక లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

