AP News | ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్.. 10 రోజుల తర్వాత మృతదేహం లభ్యం
AP News | ఏపీలోని ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) కిడ్నాప్ కథ విషాదాంతమైంది. గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడని.. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఏపీలోని శాంతి భద్రతలపై ఆందోళన మొదలైంది.
AP News | ఏపీలోని ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) కిడ్నాప్ కథ విషాదాంతమైంది. గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడని.. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఏపీలోని శాంతి భద్రతలపై ఆందోళన మొదలైంది.
ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె శివారులోని వైఎస్ జగన్ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు తన ఎదురింట్లో ఉంటున్న వెంకటేశ్‌తో కలిసి బైక్‌పై పుంగనూరు రోడ్డులో ఉన్న స్వామి వద్దకు మంత్రించుకోవడానికి వెళ్లింది. ఇదే అదనుగా స్వర్ణకుమారిని వెంకటేశ్ కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. మదనపల్లి టూటౌన్ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే అదే సమయంలో స్వర్ణకుమారి స్నేహితురాలు ఫోన్ చేసింది. కానీ కాల్ ఫార్వర్డ్ అనే వాయిస్ వినిపించింది. ఆ రోజు సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో దైవభక్తి ఎక్కువగా ఉండటంతో ఏదైనా దూర ప్రాంతంలోని గుడికి వెళ్లి ఉంటుందని భావించింది. కానీ అక్టోబర్ 1వ తేదీన పింఛన్ తీసుకునేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు తెలిపారు. దీంతో మదనపల్లెకు వచ్చిన సీఐ.. తన తల్లి ఆచూకీ కోసం చుట్టుపక్కల మొత్తం విచారించాడు. ఎక్కడ ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మదనపల్లె టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను బెంగళూరులో సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్‌కు స్వర్ణకుమారి భారీగా నగదు అప్పుగా ఇచ్చిందని.. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకటేశ్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
సీఐ తల్లి కిడ్నాప్, హత్య నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఈ అరాచకం ఏంటి చంద్రబాబూ అని ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వంలో పోలీసు కుటుంబాలకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీసింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గప్పాలు కొట్టడం కాదు.. శాంతి భద్రతలను ఎలా రక్షించాలో ఫస్ట్ తెలుసుకో అని హితవు పలికింది. ఏపీలో సీఐ ఫ్యామిలీకే రక్షణ లేదంటే ఇది మీ చేతగానితనం కాదా అని ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Dharmavaram
- Kidnap
RELATED ARTICLES
తాజా వార్తలు
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

