Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
Cyclone Arnab | బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావంతో దక్షిణమధ్య రైల్వే (South Centrel Railway) అప్రమత్తమైంది. తుపాను కారణంగా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా చర్యలు చేపట్టింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Cyclone Arnab : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావంతో దక్షిణమధ్య రైల్వే (South Centrel Railway) అప్రమత్తమైంది. తుపాను కారణంగా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా చర్యలు చేపట్టింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇవాళ, రేపు (అక్టోబర్ 27, 28) పలు రైలు సర్వీసులను రద్దుచేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల జాబితాను కూడా విడుదల చేసింది.
తుపాను తీరంవైపు సమీపిస్తున్న కొద్దీ బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం పడింది.
ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తప్పనిసరిగా రైలు నడిచేది లేనిది నిర్ధారించుకోవాలని, రైల్వే అధికారిక వెబ్సైట్ లేదా NTES యాప్ ద్వారా తమ రైలు స్టేటస్‌ను తెలుసుకోవాలని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. కింద పేర్కొన్న రైళ్లను అక్టోబర్ 27, 28 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
12704 – సికింద్రాబాద్ నుంచి హౌరా (అక్టోబర్ 27)
17016 – సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ (అక్టోబర్ 27)
12728 – హైదరాబాద్ నుంచి విశాఖపట్నం (అక్టోబర్ 27)
12862 – మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నం (అక్టోబర్ 27)
12740 – లింగంపల్లి నుంచి విశాఖపట్నం (అక్టోబర్ 27)
17256 – లింగంపల్లి నుంచి నర్సాపూర్ (అక్టోబర్ 27)
12776 – సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ (అక్టోబర్ 27)
12738 – లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్ (అక్టోబర్ 27)
20810 – హెచ్.ఎస్. నాందేడ్ నుంచి సంబల్పూర్ (అక్టోబర్ 27)
07037 – చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ (అక్టోబర్ 27)
07038 – శ్రీకాకుళం రోడ్ నుంచి చర్లపల్లి (అక్టోబర్ 28)
అదేవిధంగా తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, వాతావరణం అనుకూలించిన వెంటనే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తాజా సమాచారం కోసం రైల్వే శాఖ ప్రకటనలను గమనించాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

