సీఎం జగన్ ఇకనైనా తీరు మార్చుకోవాలి : అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు | అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అమరావతి : అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేయడం మానుకుని నిర్మాణానికి సహకరించాలని కోరారు. ‘‘రాజధాని నిర్మాణానికి కేటాయించిన భూముల్లో ఎలాంటి ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఉన్న అమరావతి రెక్కలు విరిచేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు.
సీఎం తీరు మార్చుకోకపోతే భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. రూపాయి ఖర్చు లేకుండా అమరావతి నుంచే పరిపాలన కొనసాగించే అవకాశం ఉన్నా తుగ్లక్ నిర్ణయాలతో 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారు. అమరావతితోనే అభివృద్ధి, యువతకు ఉపాధి, సంపద సృష్టి జరుగుతుందన్న విషయం ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించి రాజధాని నిర్మాణానికి సహకరించాలి’’ అని అచ్చెన్నాయుడు సూచించారు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

