Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
Arnab Cyclone | అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో ఏడు రోజులపాటు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Arnab Cyclone : అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో ఏడు రోజులపాటు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం.. కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ ఏడు రోజుల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి తీర ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.
మరోవైపు సీఎం చంద్రబాబు తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. మరోవైపు రాయలసీమలో రాబోయే నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Shiva Nirvana | బాలకృష్ణతో శివ నిర్వాణ సినిమా .. మైసూర్లో కథ వినిపించిన దర్శకుడు!
మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

