AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
AP News | ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఏకగ్రీవాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రజల ఆమోదంతో జరిగిన ఏకగ్రీవాలు కావని, అధికార మదంతో కూటమి సర్కారులోని పార్టీలు చేసిన బలాత్కారాలని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేశారు.
AP News : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఏకగ్రీవాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రజల ఆమోదంతో జరిగిన ఏకగ్రీవాలు కావని, అధికార మదంతో కూటమి సర్కారులోని పార్టీలు చేసిన బలాత్కారాలని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేశారు. అధికార కూటమి అరాచకాలకు ఈ ఏకగ్రీవాలు నిదర్శనమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తీవ్రంగా విమర్శించారు.
షర్మిల తన ప్రకటనలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కూటమి కమిషన్‌గా అభివర్ణించారు. నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, పోలీసు వ్యవస్థను బానిసగా మార్చి, ప్రతిపక్ష అభ్యర్థుల పత్రాలు చించివేసి, వారిని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. రక్తపాతంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఘనత కూటమి పార్టీలదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 16 మున్సిపాలిటీలు, 639 వార్డులు, 4 జెడ్పీటీసీలు, 32 ఎంపీటీసీ స్థానాల్లో జరిగినవి ఏకగ్రీవాలు కాదని, కూటమి సృష్టించిన భయోత్పాతానికి నిదర్శనాలని అన్నారు.
ఇది ప్రభంజనం కాదని, కూటమి రాజకీయ నిస్తేజమని షర్మిల వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలుస్తూ షర్మిల కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆనాడు వైసీపీ చేసిందని నేడు మీరు చేస్తారా..? వాళ్లు గడ్డి తిన్నారని మీరు అదే తింటారా..? కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదా..? బలవంతపు ఏకగ్రీవాల పేరుతో ఈ విచక్షణా రాహిత్యం ఎందుకు..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
బలవంతపు ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిల డిమాండ్ చేశారు. ఏకగ్రీవాల ఫలితాలను నిలిపివేసి, పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

