ఏపీ హైకోర్టు తీర్పు యావత్తు ఆంధ్ర ప్రజల విజయం..
amaravati leaders| అమరావతి రాజధానిపై హైకోర్టు యావత్తు ఆంధ్ర ప్రజల విజయమని అమరావతి ఐక్యకార్యచరణ సమితి నాయకులు అన్నారు. తిరుపతిలో వారు మీడియాతో
అమరావతి: అమరావతి రాజధానిపై హైకోర్టు యావత్తు ఆంధ్ర ప్రజల విజయమని అమరావతి ఐక్యకార్యచరణ సమితి నాయకులు అన్నారు. తిరుపతిలో వారు మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజలే నడిపించారని అందుకు సహకరించిన వారిందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం మూడు ముక్కలాటను ఆపాలని, రాజకీయ కుయుక్తుల కోసం రాష్ట్ర ప్రజలను మూడు ప్రాంతాలుగా విడగొట్టొద్దని కోరారు.
రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర అనేక తప్పిదాలకు పాల్పడిందని విమర్శించారు. అమరావతి ముంపు ప్రాంతమని, ఒకే కులానికి చెందిన ప్రాంతామని చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హైకోర్టు వెలువడించిన 307 పేజీల తీర్పును ఏపీ మంత్రులు, సలహదారులు చదువకుండా మళ్లీ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు విధానాలను అవలంభిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలంటే అమరావతిని అభివృద్ధి పరిచాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

