Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Cyclonic storm | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తీవ్ర తుపాను ముప్పు పొంచివున్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారి తీరంవైపు దూసుకొస్తోందని, ఈ తుపాను అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది.
Cyclonic storm : ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తీవ్ర తుపాను ముప్పు పొంచివున్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారి తీరంవైపు దూసుకొస్తోందని, ఈ తుపాను అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఏపీకి హెచ్చరిక జారీచేసింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీచేశారు. ఒడిశా సర్కారు కూడా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నది. తీరం వెంబడి విపత్తు నిర్వహణ సిబ్బందిని భారీగా మోహరించింది. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది.
కాగా ఐఎండీ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. ఈ సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26న తుపానుగా, 27న తీవ్ర తుపానుగా, 28 నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది.
అక్టోబర్ 28న ఉదయం తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తుపాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబు.. సీఎస్ సాయి ప్రసాద్‌తో, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

