Tragedy | విద్యుదాఘాతానికి గురైన వృద్ధురాలు, ఆమెను కాపాడబోయిన వ్యక్తి మృతి
Tragedy | వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండలం ఇబ్రహీం పేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు.
అమరావతి : వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండలం ఇబ్రహీం పేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు. సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది . గంగమ్మ(68) అనే వృద్ధురాలు ఇంటిలోని ఫ్రిడ్జ్‌ను తెరిచిన సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోగా ఆమెను కాపాడబోయిన పొరుగున ఉన్న కొండయ్య (55)అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.
అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

