లోతు దుక్కులు మేలు

తెలంగాణ సాగుభూముల్లో పోషకాలకు కొదువ లేదని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవి దుక్కులపై పలు సలహాలు, సూచనలను వారు అందించారు.
- ఇప్పటికే కోతలు పూర్తయిన పొలాలను ఈ వేసవిలోనే చదును చేసుకొని, సేంద్రియ ఎరువులు చల్లుకోవాలి.
- తొలకరికి ముందుగానే నేలను కనీసం రెండుసార్లయినా లోతుగా దున్నుకోవాలి.
- వర్షాలు ప్రారంభం కాకముందే పొలాలను సాగుకు సిద్ధం చేసుకోవాలి.
- చెరువుల్లోని ఒండ్రుమట్టిని పొలాల్లో వేయించుకుంటే మంచిది. ఇది చేనుకు ఎంతో మేలు చేస్తుంది.
- పశువుల పేడనూ వీలైనంత ఎక్కువగా వాడుకోవాలి.
- కొన్నిచోట్ల యాసంగిలో వేరుశనగ కోసిన వెంటనే లోతు దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులతో ప్రయోజనాలు
- వేసవి దుక్కులతో వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.
- ఈ దుక్కులవల్ల నేలలోని నీరు ఇంకని పొరలు తొలగిపోయి, నీరు ఇంకే గుణం పెరుగుతుంది.
- ఫలితంగా పొలంలో కురిసిన వర్షపు నీరు అక్కడికక్కడే నేలలోకి ఇంకి, భూగర్భ జలాలు పెరుగుతాయి.
- నేలకోతను నిలువరించి, నేలతోపాటు భూసారాన్నీ కాపాడుతుంది.
- వేసవిలో పగలు వేడి తాపానికి, రాత్రి చల్లదనానికి నేల మొత్తం గుల్లగా తయారవుతుంది. దీనివల్ల నేల ఆకృతి వృద్ధి చెందుతుంది.
- ఫలితంగా పంటకాలంలో మొక్కల వేర్లు నేల లోపలి పొరలకు చేరుతాయి. నేలలోని గాలిశాతం పెరిగి, సూక్ష్మజీవాల సంఖ్య వృద్ధి చెందుతుంది.
- పంటకు చెందిన సేంద్రియ వ్యర్థాలు పూర్తిగా, త్వరగా కుళ్లిపోయి, భూసారం పెరుగుతుంది.
- వర్షాధార పంటల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు, పంటవేర్లు లోతుగా ఉండటం వల్ల నేలలోపలి పొరల్లోని తేమను వినియోగించుకొని బెట్టను తట్టుకునే శక్తి వస్తుంది.
- వేసవిలో దున్నడం వల్ల నేల పొరల్లోని క్రిములు, పురుగుల కోశస్త దశలు బహిర్గతమై చనిపోతాయి.
- కలుపు విత్తనాలూ నశించిపోతాయి. దీనివల్ల తర్వాతి పంటకాలంలో కలుపు దరి చేరదు.
- వేసవిలో లోతు దుక్కులతో జూన్ నెలలో తొలకరి మొదలైన వెంటనే పంట విత్తడం సులభమవుతుంది.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
- Tags
- agriculture
- వ్యవసాయం
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

