చిన్న యంత్రం..పెద్ద సాయం!
వ్యవసాయంలో యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి, కూలీల కొరతను అధిగమించడానికి ఇవే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో యంత్రాల కోసమే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. దీనిని నివారించడానికి పలువురు రైతులు వినూత్న మార్గాలు ఎంచుకొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చే యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకొంటున్నారు, మరికొందరు సొంతంగా తయారు చేసుకొని వాడుకొంటున్నారు.
ఖర్చులు తగ్గించేలా..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఎండెపు కృష్ణ అనే యువరైతు తక్కువ పెట్టుబడితో అధిక ప్రయోజనం పొందుతున్నాడు. సాగులో రోజు రోజుకూ పెరుగుతున్న ఖర్చులు తగ్గించుకోవాలని భావించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా, రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా బదిసాద్రి మండలంలో ద్విచక్ర వాహనానికి యంత్రాలను అమర్చి సాగు చేయడాన్ని గుర్తించాడు. ఇటీవలే రాజస్థాన్‌కు వెళ్లి రూ.90 వేలతో కల్టివేటర్, సీడ్ డ్రిల్లర్, స్ప్రే మిషన్లను కొనుగోలు చేసి తెచ్చాడు. వాటిని తన ద్విచక్ర వాహనానికి అమర్చి, త్రీవీలర్ ట్రాక్టర్‌లా మార్చేశాడు. ఈ యంత్రంతోనే దుక్కి దున్నడం, విత్తడం, కలుపు తీయడం, పత్తి చేలలో మందు స్ప్రే చేయడం లాంటి పనులన్నీ చేస్తున్నాడు. కేవలం రూ.90 వేల పెట్టుబడితో లక్షల విలువైన ట్రాక్టర్ చేసే పనులన్నీ నిర్వహిస్తున్నాడు.
–నరాల కృష్ణ, భైంసా
ఉపాయంతో ఉపాధి

ఆరుతడి పంటల్లో కలుపు నివారణ కోసం గుంటుక తీయాల్సిందే. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సిందే. అయితే, తక్కువ పెట్టుబడితోనే యంత్రాన్ని కొనుగోలు చేసి, కూలీల ఖర్చును ఆదా చేస్తున్నాడు ఓ యువరైతు. నల్లగొండ మండలం రసూల్‌పురా గ్రామానికి చెందిన గుండెబోయిన వెంకన్న, 30 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. చేనులో గడ్డిని తొలగించేందుకు (గుంటుక కొట్టేందుకు) కూలీలకోసమే బాగా ఖర్చయ్యేది. ఈ డబ్బును ఆదా చేసేందుకు సోషల్ మీడియాలో వెదికి, గుజరాత్లో బుల్లెట్ వాహనంతో గుంటుక తీయిస్తున్న విధానాన్ని గుర్తించాడు. రూ.1.50 లక్షలతో బుల్లెట్, మినీ ట్రాక్టర్ తెప్పించుకొన్నాడు. దీని సాయంతో తన చేనులో గుంటుక కొట్టడంతోపాటు ఖాళీ సమయంలో ఇతర రైతుల పొలాల్లోనూ కలుపు తీస్తూ ఉపాధి పొందుతున్నాడు.
–రమేశ్ పోగుల, నల్లగొండ రూరల్
కూలీలకు పైసల్లేక..

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన మల్లేశ్ నిరుపేద రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో ‘రైతుబంధు’ సాయంతో పత్తి వేశాడు. అయితే, గుంటుక కొట్టేందుకు అతనివద్ద ఎడ్లు లేవు. ట్రాక్టర్ బాడుగకు కానీ, కూలీలను పెట్టుకొనేందుకు కానీ డబ్బులు లేవు. దీంతో వినూత్నంగా ఆలోచించాడు. తను నిత్యం ఉపయోగించే ద్విచక్ర వాహనానికే గొర్రు కట్టి, గుంటుక కొడుతున్నాడు. ఇందుకోసం తన బైక్‌నే గుంటుక యంత్రంగా మార్చేశాడు.
–గుజ్జ నరేశ్ ఫొటోగ్రాఫర్, యాదాద్రి
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

