తాండూర్ : తాండూర్ మండల కేంద్రంలోని విద్యాభారతి( Vidya Bharati ) ఉన్నత పాఠశాల జాతీయస్థాయిలో మరో ఆవార్డు ( National-Level Award ) అందుకుంది. సౌత్ ఇండియా ఎడ్యుకేషన్ సమ్మిట్ ( 2026 ) లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ పాఠశాలలను గుర్తించి అవార్డుల అందజేయగా వాటిలో విద్యాభారతి హైస్కూల్ కు జాతీయ స్థాయిలో డైనమిక్ స్కూల్ అవార్డు లభించినట్టు పాఠశాల డైరెక్టర్ సురభి శరత్ కుమార్ ( Sharath Kumar ) తెలిపారు.
బోధన అంశాలలో విభిన్నత అంశంలో పాఠశాలకు ఈ అవార్డు లభించిందని ఆయన వివరించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమములో అవార్డు అందుకోవడం సంస్థ పనితీరుకు గర్వకారణమని అన్నారు. అవార్డు ప్రదానంలో అకాడమిక్ డైరెక్టర్ సౌమ్యరావు కూడా పాల్గొన్నట్లు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది అంకితభావంతో చేసిన కృషితో అవార్డు వచ్చిందని విద్యాభారతి విద్యా సంస్థ చైర్మన్ సురభి ఆగమారావు సిబ్బందిని అభినందించారు.