Dragon Fruit | ఇతర దేశాలకే పరిమితమనుకున్న డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోనూ పండిస్తున్నారు. ఇతర పంటల వైపు దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పిలుపును కొందరు రైతులు ఆచరణలో పెడుతున్నారు. లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన చిన్నయ్య పూర్తి సేంద్రియ విధానంలో ఎకరంలో పంట సాగు చేసి, దిగుబడి సాధిస్తున్నాడు. యూట్యూబ్, ఇతర రాష్ర్టాల్లో రైతులను సంప్రదించడం ద్వారా పంటపై అవగాహన పెంచుకొని, తొలిసారే రూ. 6 లక్షల వరకు లాభం ఆర్జించాడు. ఒక్కసారి పంట వేస్తే 30 ఏండ్ల వరకు దిగుబడి రానుండగా, రానున్న రోజుల్లో మరింత ఆదాయం వచ్చే అవకాశముందని చెబుతున్నాడు.
లక్షెట్టిపేట రూరల్,జూన్ 22 : కొన్నేళ్ల క్రితం ఇతర దేశాలకే పరిమితం అనుకున్న పంటలు మన నేలల్లో కూడా పండించవచ్చని నిరూపిస్తున్నారు మన రైతులు. కొంచెం భిన్నంగా ఆలోచించి కొత్త మార్గాలను అన్వేషిస్తూ వైవిధ్యమైన పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. విసృ్తతమైన ఆలోచనలకు అవకాశాలు అనేకంగా ఉంటాయని లక్షేట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు గడుసు చిన్నయ్య విశ్వసించి విభిన్నమైన ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చి తనకున్న భూమిలో ఒక ఎకరం డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. పంట పూర్తి సమాచారం సేకరించేందుకు ఆ పంట పండిస్తున్న పలు రాష్ట్రాల్లోని రైతుల వద్దకు సాగు విధానాన్ని తెలుసుకున్నాడు. పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేయాలని నిర్ణయించాడు. గతేడాది ఒక ఎకరం భూమిలో సీయాం రెడ్ అనే రకాన్ని ఎంచుకొని పంట ప్రారంభించాడు. సుమారు రూ. 8 లక్షల పెట్టుబడి పెట్టాడు. గత జనవరిలో వేసిన పంట అక్టోబర్ లో మొదటి విడుతలో చేతికి వచ్చింది. సుమారు రూ. 6 లక్షల వరకు లాభం చేకూరింది. వచ్చే ఏడాది లోపు సుమారు రూ. పది లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఏడాదిన్నర లోపు పంట చేతికి వచ్చి, మొదటి సంవత్సరం నుంచే మంచి లాభాలు రావడం మొదలవుతుంది. ఎకరానికి నాలుగు టన్నుల డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి పంట చేతికి వస్తే దాదాపు 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నారు.
తకువ సాగునీరు
తకువ సాగునీరుతోనే ఈ పంటను పండించవచ్చు. ఎండను తట్టుకొని పండే పంటగా దీన్ని పేరొంటారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీళ్లలో కేవలం ఒకటో వంతు నీరు ఈ పంటకు సరిపోతుంది
మంచి ఆదాయం
ఈ ఫ్రూట్‌కి మారెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ పంట పండించిన రైతుకు మంచి ఆదాయం వస్తుంది. అంతేకాకుండా మొదటి సంవత్సరం నుంచి ఈ పంట చేతికి వస్తుండడం కేవలం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ పంటకు సాగునీరు సరిపోతుండడం కూడా రైతులకు కలసి వస్తున్నది.
పోషకాల గని
డ్రాగన్ ఫ్రూట్‌ను పిటాయ,స్ట్రాబెర్రి పియర్ అని పిలుస్తారు. ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలున్న ఈ ఫ్రూట్‌ని పోషకాల స్టోర్ హౌస్ అని కూడా చెబుతారు. ఈ ఫ్రూట్ లో శరీరానికి శక్తినిచ్చే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ల తో పాటు మెగ్నీషియం క్యాల్షియం ఐరన్ ఫాస్పరస్‌లు కూడా మెండుగా ఉంటాయి. అందుకే దీనిని పోషకాల గని అంటారు. ఇలాంటి పంటలు పండిస్తున్న రైతులకు హార్టికల్చర్ అధికారులు తగిన ప్రోత్సాహకాన్ని అందిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
యూట్యూబ్‌లో చూసే మొదలుపెట్టా..
యూట్యూబ్ లో ఈ పంట గురిం చి చూసి ఈ ఫ్రూ ట్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నా. పలు రాష్ట్రాల్లో ఈ పంట పండిస్తున్న రైతుల వద్దకు వెళ్లి సమాచారం సేకరించాను. సియాం రెడ్ అనే రకాన్ని ఎంచుకొని పూర్తిస్థాయిలో సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాను. ఏడాదిన్నర లోపు పంట చేతికి వస్తుంది. ఈ ఏడాది సుమారు నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. పంట వేసినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఖర్చు ఉండదు.
-రైతు గడుసు చిన్నయ్య