Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లోని దళితవాడల్లో బుధవారం దమ్మ చక్ర పరివర్తన దివస్ అశోక్ విజయ దశమిని ఘనంగా నిర్వహించారు.
నార్నూర్ : ఆదిలాబాద్ (Adilabad ) జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లోని దళితవాడల్లో బుధవారం దమ్మ చక్ర పరివర్తన దివస్ ( Dhamma Parivartan Divas) అశోక్ విజయ దశమిని ఘనంగా నిర్వహించారు. మాన్కాపూర్, తాడిహత్నూర్, కొత్తపల్లి, ముల్లంగి, నార్నూర్, దుప్పాపూర్, సుంగపూర్, నడ్డంగూడ, భీంపూర్, ఉమ్రి, లోకరి,ఝర్రీ, మారేగావ్,ఖడ్కి, బుద్ధ గూడ, ధాబాతో పాటు దళిత వాడలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. గౌతమ బుద్ధుని ప్రతిమకు పూజలు చేశారు. పంచశీల జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుని మార్గాన్ని అనుసరిస్తూ.. బాబాసాహెబ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బానోత్ కావేరి, తోడసం రేణుక, కనక సత్యనారాయణ, లక్ష్మణ్, తానాజీ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తొడసం నాగోరావ్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోకండే చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ హేమలత బ్రిజ్జిలాల్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే, కోరల మహేందర్, బౌద్ధ మతస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

