ఆజాద్ కృషి చిరస్మరణీయం
దే శంలో విద్యారంగ అభివృద్ధికి మౌలానా అ బుల్ కలాం ఆజాద్ కృషి చిరస్మరణీయమని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ కే హరిత పే ర్కొన్నారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం కలెక్టరేట్లో జిల్లా మై నారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 11 : దే శంలో విద్యారంగ అభివృద్ధికి మౌలానా అ బుల్ కలాం ఆజాద్ కృషి చిరస్మరణీయమని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ కే హరిత పే ర్కొన్నారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం కలెక్టరేట్లో జిల్లా మై నారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్ మున్సిపల్ చై ర్మన్ మెంగ్రే ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మ ద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అలీబిన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తిరుపతి, కౌన్సిలర్లు సాలాంబిన్ అహ్మద్, బాలకృష్ణ, మైనారిటీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
డీఎండబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలి..
జయంతి వేడుకల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనపై మైనారిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులకు ముందస్తు సమాచారం, ఆహ్వాన పత్రిక అందించకపోవడంపై కలెక్టర్ హరిత సమక్షంలోనే డీఎండబ్ల్యూవో తీరుకు నిరసనగా వేడుకలను బహిషరించారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో శాంతించిన నాయకులు, అనంతరం వేడుకల్లో పాల్గొన్నారు.

మంచిర్యాలలో..
నస్పూర్, నవంబర్ 11 : మంచిర్యాల కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రయ్య పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జి ల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వ రి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల టౌన్, నవంబర్ 11 : మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. దేశానికి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల శం కర్, గంగులు, రఫీక్, షకీల్, సోమిడి మహేందర్, తోటి ఉమాకాంత్, ఈసారపు శ్రీనివాస్, గుమ్మడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మందమర్రి, నవంబర్ 11 : మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో గల మనోవికాస్ పాఠశాలలో పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. మైనారిటీ నాయకులు ఎండీ యాకుబ్, షరీఫ్, ఇమామ్ సాబ్, ముజఫర్ హుస్సేన్, నిజామ్, సుకూర్, రహమత్‌ఖాన్, ఇసీక్, ఖాజా విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

