ఆరు పదుల్లో అక్షరాభ్యాసం

చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే కానీ, వయసు అడ్డుకాదని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. తమిళనాడుకు చెందిన ధనాబకియం అమ్మళ్ ఆ జాబితాలో కొత్తగా చేరారు. ఆమె వయసు అరవై అయిదు. కరోనా కష్టకాలంలోనూ అక్షరాలు దిద్దేందుకు బయలుదేరింది. అంగన్వాడీ కార్యకర్తగా ఈమధ్యే ఉద్యోగ విరమణ చేసింది అమ్మళ్. కొలువులో ఉండగా, జీతం తీసుకున్న ప్రతిసారీ వేలిముద్ర వేయాల్సి వచ్చేది. చదువుకుందామంటే సమయం దొరికేది కాదు. పింఛను తీసుకుంటున్నప్పుడైనా, సంతకం చేయాలని తీర్మానించుకొంది. ఆ ప్రయత్నంలో భాగంగా.. కొత్తమంగళం ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు చిత్రారాణిని కలిసింది. తనకు పాఠాలు చెప్పాల్సిందిగా కోరింది. చిత్రారాణికి ఇదంతా చిత్రంగా అనిపించింది. అక్షరాలు దిద్దించడానికి సంతోషంగా ముందుకొచ్చింది. ‘నేనిప్పుడు అక్షరమాల రాయగలుగుతున్నాను. అలాగే, పత్రికల హెడ్‌లైన్స్ చదువుతున్నాను. ప్రస్తుతం మూడో తరగతి పుస్తకాల్లోని పాఠాలు చెబుతున్నారు నాకు” అంటున్నది అమ్మళ్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

