వానల్లో మెరవాలంటే..
చుండ్రు బాధ చలికాలంలోనే కాదు వానాకాలంలోనూ అధికంగానే ఉంటుంది. కానీ, చలికాలంలో తీసుకున్నంత శ్రద్ధ వానాకాలంలో తీసుకోరు. ఈ సీజన్లో వీచే చల్లని గాలి ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ, అది చర్మానికి హాని చేస్తుంది.
చుండ్రు బాధ చలికాలంలోనే కాదు వానాకాలంలోనూ అధికంగానే ఉంటుంది. కానీ, చలికాలంలో తీసుకున్నంత శ్రద్ధ వానాకాలంలో తీసుకోరు. ఈ సీజన్లో వీచే చల్లని గాలి ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ, అది చర్మానికి హాని చేస్తుంది. అధిక తేమ కలిగిన గాలి వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మ పగుళ్లకు, మొటిమలు, ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
కాబట్టి అధిక తేమ వాతావరణం వల్ల కాలుష్య ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రభావాల నుంచి చర్మాన్ని, జుట్టుని కాపాడుకునేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఇలా చేస్తే వానాకాలంలో అందమైన కురులు, కాంతిమంతమైన చర్మాన్ని కాపాడుకోవచ్చు.
- ఉదయం, రాత్రి స్నానంతోపాటు బయట ప్రయాణాలు, ఆఫీసు పనిలో ఉన్నా తప్పకుండా రెండుసార్లు మైల్డ్ క్లెన్సర్స్తో ముఖం, మెడ భాగాలను శుభ్రం చేసుకోవాలి.
- జిడ్డు వల్ల మూసుకుపోయిన స్వేద రంధ్రాలు తెరుచుకునేందుకు హ్యులురోనిక్ యాసిడ్, అలోవిరా, నియోసినమైడ్ కలిగిన నాన్ కమెడోజెనిక్ మాయిశ్చరైజర్లతో ముఖం కడగాలి.
- సన్‌స్క్రీన్ క్రీమ్ లేదా జెల్‌ని ఈ కాలంలోనూ రాయాలి.
- మృత కణాలను తొలగించేందుకు వారానికి ఒకసారి లాక్టిక్ యాసిడ్‌తో తయారు చేసిన ఎక్స్పోలియెంట్స్ని ఉపయోగించాలి.
- మృతకణాలు, జిడ్డును తొలగించేందుకు కఠినమైన స్క్రబ్స్‌తో రుద్ద కూడదు.
- లేత రంగుల మేకప్ మాత్రమే వేసుకోవాలి. తేలికపాటి మాయిశ్చరైజర్లే ఉపయోగించాలి. మినరల్స్ కలిగిన పౌడర్లు రాసుకోవచ్చు.
- వివిధ రకాల ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్తపడటం చాలా ముఖ్యం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

