Sprouts for Health | ఆరోగ్యానికి ఆశల .. మొలక!

గింజ, మొలక, మొక్క, చెట్టు .. ఇది వృక్ష వికాస క్రమం. ఆలోచన, ఆచరణ, శ్రమ, లాభం.. ఇది వ్యాపార విజయ సూత్రం. సూర్యాపేటకు చెందిన ఓరుగంటి లావణ్య గెలుపు రహస్యమూ ఇలాంటిదే. తనతో పాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నదామె .. మొలకల వ్యాపారంతో!
గింజలతో మొలకలేమిటి? వాటిని ప్యాకెట్లు చేసి అమ్మడం ఏమిటి? ఇదో వ్యాపారమా..? అంటూ లావణ్యను ఎగతాళి చేసిన వారే, నేడు ముక్కున వేలేసుకొంటున్నారు. మక్కువతో పొగుడుతున్నారు. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, పద్దెనిమిదేండ్ల క్రితం పొదుపు సంఘాల డబ్బుతో మొలకల వ్యాపారం ప్రారంభించింది సూర్యాపేటకు చెందిన లావణ్య. నేడు నెలకు లక్షన్నరకు పైగా టర్నోవర్‌తో రూ. 45 వేల వరకూ లాభం సంపాదిస్తున్నది. అంతేకాదు, ఓ ఐదుగురు మహిళలకు ఉపాధిని కల్పిస్తూ.. కుటుంబ నిర్వహణలో భర్తకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. పెసర, బొబ్బర్లు, మంచి శెనగలు, వేరుశెనగ, రాగులు, సజ్జలు, జొన్నలు, క్యారెట్, కొబ్బరి, కర్జూర, గోధుమలు, ఉలవలు, తెల్లజొన్న.. తదితర గింజలే ఆమె వ్యాపారానికి ప్రధాన ముడిసరుకు.
నా కలల పంట!
‘అప్పట్లో సూర్యాపేటలో సిద్ధ సమాధి యోగ తదితర ధ్యాన, యోగా క్లాసులు నిత్యం జరుగుతుండేవి. నేనూ వెళ్లేదాన్ని. ఉదయం పూట మొలకలు పెట్టేవారు. వాటిని తినడం వల్ల, పది రోజుల్లో నాలో ఎంతో మార్పు కనిపించింది. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ.. జనం ఆహారపు అలవాట్లు మారుతున్న నేపథ్యంలో నేనూ మొలకల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నా. అత్తయ్య లక్ష్మమ్మకు, భర్త శ్రీనివాస్‌కు మనసులోని మాట చెప్పాను. ఇద్దరూ ప్రోత్సహించారు. అత్తయ్య ఒకడుగు ముందుకేసి, మొలకలను చిన్నచిన్న ప్యాకెట్లు చేయడంలో నాకు సహకరించింది. అదే సమయానికి మూడు లక్షల రూపాయల పొదుపు సంఘం డబ్బు వచ్చింది. అందులో నా భాగమైన రూ.30 వేలతో సరుకులు కొన్నాను. మొదట్లో రోజుకు ఐదు నుంచి పదిహేను ప్యాకెట్లు విక్రయించడమే గగనం. ప్రస్తుతం ఐదారు వందల ప్యాకెట్లు అమ్ముతున్నాం. ఒక్కో ప్యాకెట్ ధర రూ.10. ఐదుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. ఒక్కొక్కరికి మూడువేల రూపాయల జీతం ఇస్తున్నాను. ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున పని ఉంటుంది. ద్విచక్ర
వాహనం మీద టీ స్టాళ్లకు బేకరీలకు సరఫరా చేస్తాను. సాయంత్రం వెళ్లి డబ్బు వసూలు చేస్తాను’ అంటూ తన విజయగాథను వినిపిస్తుంది లావణ్య. ఆమె భర్త ఆర్టీసీలో ఉద్యోగి. పెండ్లి నాటికి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కానీ ఇప్పుడు, ఇద్దరి సంపాదనతో పిల్లలను చదివిస్తున్నారు. ఓ ఇల్లూ కొనుక్కోగలిగారు.
...గుండా శ్రీనివాస గుప్త
సూర్యాపేట
Photo: పక్కీరు సైదిరెడ్డి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

