నీమ్ కరోలీ బాబా
హనుమత్ ఉపాసకునిగా నీమ్ కరోలీ బాబా విదేశాలలోనూ ప్రసిద్ధుడైనాడు. నీమ్ కరోలి అన్నది ఒక గ్రామం. అసలు పేరు లక్ష్మణదాసు అయినప్పటికీ అందరూ ఆయన్ను ఆ ఊరుపేరిటే పిలుస్తుంటారు. బాబా ఒకసారి రైలెక్కాడు. మధ్యలో టికెట్ కలెక్టర్ వచ్చాడు. బాబా దగ్గర టికెట్ లేకపోవడంవల్ల నీమ్ కరోలీ అనే గ్రామం దగ్గర దింపి వేశాడు. అక్కడ వాస్తవానికి రైల్వే స్టేషన్ లేదు.
అదూషయన్ సతాం మార్గం
ధ్యానయుక్తో మహీం చరేత్
(నారద పరివ్రాజకోపనిషత్తు 4-17)
సజ్జనుల మార్గాన్ని దూషించకుండా ధ్యానశీలుడై భూమిపై సంచరించాలి అని పై ఉపనిషత్ వాక్యానికి అర్థం. సాధువులను నిందించరాదు. నిర్లక్ష్యం చేయరాదు. సత్పురుషులను నిందించడం వల్ల వారికేమీ నష్టం కలుగదు. కానీ, అలా నిందించిన వారికే ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అటువంటి సాధువుల గురించి గాని, లేదా వారిలాగా గాని ధ్యానించాలి. ఈ సందర్భంగా నీమ్ కరోలీ బాబా గురించిన ఒక సంఘటన చెప్పుకొందాం.
హనుమత్ ఉపాసకునిగా నీమ్ కరోలీ బాబా విదేశాలలోనూ ప్రసిద్ధుడైనాడు. నీమ్ కరోలి అన్నది ఒక గ్రామం. అసలు పేరు లక్ష్మణదాసు అయినప్పటికీ అందరూ ఆయన్ను ఆ ఊరుపేరిటే పిలుస్తుంటారు. బాబా ఒకసారి రైలెక్కాడు. మధ్యలో టికెట్ కలెక్టర్ వచ్చాడు. బాబా దగ్గర టికెట్ లేకపోవడంవల్ల నీమ్ కరోలీ అనే గ్రామం దగ్గర దింపి వేశాడు. అక్కడ వాస్తవానికి రైల్వే స్టేషన్ లేదు. బాబా రైలు దిగి పక్కన నిలబడిపోయినాడు. సమాధి స్థితిలోకి జారుకున్నాడు. రైలు మాత్రం కదలదు. డ్రైవర్ శతవిధాలా ప్రయత్నించాడు. ఫలితం శూన్యం. ప్రయాణికులు కొందరు ‘యోగి పుంగవుడైన బాబాను దింపినారు. ఆయనను మళ్లీ ఎక్కమనండి. రైలు కదులుతుంది’ అన్నారు. ‘ఈ కాలంలోనూ ఇంత మూఢనమ్మకమా!’ అని అపహాస్యం చేశాడు టికెట్ కలెక్టర్. కానీ, డ్రైవర్ ఎంత ప్రయత్నించినా రైలు కదలకపోవడం, ప్రయాణికులు పదేపదే చెప్పడంతో పై అధికారులకు వర్తమానం అందించాడు. వాళ్లు కూడా ‘సాధువును ఎక్కించండి మరి, రైలు నడిచేైట్టెతే’ అన్నారు. టీసీ ఆ బాబాతో ‘స్వామీ! రైలు ఎక్కండి‘ అన్నాడు. సమాధినుంచి తేరుకున్న స్వామి ‘ఒకసారి దిగినాక మళ్లీ ఎక్కాలంటే కుదరదు’ అన్నాడు. టీసీ ఎంతో బతిమలాడు. ‘నేను రైలు ఎక్కాలంటే రెండు పనులు చేయాలి’ అన్నాడు బాబా. ‘చెప్పండి’ అన్నారు అధికారులు. ‘ఈ నీమ్ కరోలీ గ్రామంలో రైలు స్టేషన్ ఏర్పరచాలి’ అన్నాడు. ‘సరే మంచిది. మరి రెండోది?‘ అన్నాడు టీసీ. ‘సాధువులను మరెప్పుడూ అవమానించరాదు. తగువిధంగా గౌరవించాలి. అది మన ధర్మం’ అన్నాడు బాబా. టీసీకి ఒప్పుకోక తప్పలేదు. బాబా రైలెక్కాడు. వెంటనే రైలు కదిలింది.
డా॥ వెలుదండ సత్యనారాయణ…?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

