ప్రేమ కిరీటం!
‘చాలా రోజుల తర్వాత ఆత్మీయులను కలవడం సంతోషంగా ఉంది. నా వాళ్లు గర్వపడే విజయం సాధించానని అనుకుంటున్నా. ఇలాంటి కుటుంబం దొరకడం నా అదృష్టం.
‘చాలా రోజుల తర్వాత ఆత్మీయులను కలవడం సంతోషంగా ఉంది. నా వాళ్లు గర్వపడే విజయం సాధించానని అనుకుంటున్నా. ఇలాంటి కుటుంబం దొరకడం నా అదృష్టం. ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ ఉద్వేగానికి గురైంది ‘లివా మిస్ దివా సూపర్నేషనల్- 2022’ కిరీటాన్ని దక్కించుకున్న తెలంగాణ అమ్మాయి ప్రజ్ఞ అయ్యగారి. విజయ మకుటంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రజ్ఞకు ఘన స్వాగతం లభించింది.
‘ప్రౌడ్ డాడ్’, ‘ప్రౌడ్ మామ్’ వంటి ప్లకార్డులతో స్వాగతం పలికి.. కూతురిని ముద్దులతో ముంచెత్తారు తల్లిదండ్రులు మాధవి, శ్రీనివాస్. అందాల కిరీటాన్ని అమ్మానాన్నలకు అలంకరించి తన విజయాన్ని అంకితమిచ్చిందీ అందాల భామ. ప్రజ్ఞ క్వాలిఫైడ్ ఫ్యాషన్ డిజైనర్. భరతనాట్య కళాకారిణి. చదరంగం అంటే ఇష్టం. కొరియన్ మూవీస్ తెగ చూస్తుంది. ఎకోఫ్రెండ్లీ వస్ర్తాలతో ఓ బ్రాండ్ సృష్టించాలన్నది తన కల. అందాలపోటీతో వచ్చే పేరు, డబ్బు ఇందుకు ఉపయోగపడతాయని నమ్ముతున్నది ప్రజ్ఞ. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్‌లో తన స్కూలింగ్ పూర్తయింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

