వేసవిలో డ్రైయర్ వాడొచ్చా?
కేశాలు మనిషి తలకు రక్షణ వ్యవస్థ లాంటివి. ఎండ వేడి నుంచి మాడుకు నీడనిస్తాయి. ప్రమాదాల్లో దెబ్బలు తగలకుండా మెదడుకు సుతిమెత్తని కవచంలా పనిచేస్తాయి. అందులోనూ సేబమ్ అనే జిడ్డు పదార్థం కేశాలు పొడిబారకుండా, తద్వారా శరీరం వేడెక్కకుండా నిలువరిస్తుంది.
నమస్తే. తలస్నానం తర్వాత హీట్ బ్లో హెయిర్ డ్రైయర్ వాడటం నాకు అలవాటు. వేసవిలో ఇది సురక్షితమేనా? ఏమైనా ఇబ్బంది కలుగుతుందా?
- ఓ పాఠకురాలు
కేశాలు మనిషి తలకు రక్షణ వ్యవస్థ లాంటివి. ఎండ వేడి నుంచి మాడుకు నీడనిస్తాయి. ప్రమాదాల్లో దెబ్బలు తగలకుండా మెదడుకు సుతిమెత్తని కవచంలా పనిచేస్తాయి. అందులోనూ సేబమ్ అనే జిడ్డు పదార్థం కేశాలు పొడిబారకుండా, తద్వారా శరీరం వేడెక్కకుండా నిలువరిస్తుంది. వేసవిలో మనం అనాలోచితంగా చేసే పనులు జుట్టుకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. కేశ సంపదను నాశనం చేస్తాయి.
ఎలాంటి రక్షణా లేకుండా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లడం వల్ల.. వెంట్రుకలు సున్నితత్వాన్ని కోల్పోతాయి. చిట్లి పోతాయి. పొడిబారి రాలిపోతాయి. రంగు మారిపోతుంది కూడా. వేసవిలో తలస్నానం తర్వాత తరచూ బ్లో డ్రైయర్ వాడటం అంత మంచిది కాదు. దీనివల్ల, చర్మం విడుదల చేసే సహజ తైలాలు మటుమాయం అవుతాయి. తప్పనిసరి అయినప్పుడు కోల్డ్ బ్లో డ్రైయర్ ఎంచుకోవడమే ఉత్తమం. నిజానికి, కేశాలకు ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులే మేలు.
డాక్టర్ అనున్యా రెడ్డిఇ.ఎన్.టి సర్జన్,
ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

