వైట్ వాష్ చేసేద్దామా!
తెలుపు స్వచ్ఛతకు గుర్తు. శాంతికి నిదర్శనం. రంగురంగుల దుస్తులు ఎన్ని ఉన్నా.. పిండివెన్నెలంటి వన్నెతో మెరిసిపోయే తెల్లటి దుస్తుల ముందు అన్నీ దిగదుడుపే! అయితే, తెల్లటి దుస్తులు వేసుకోవడం చాలామందికి ఇష్టమే! కానీ, వాటి నిర్వహణ మాత్రం చికాకు తెప్పిస్తుంది.
తెలుపు స్వచ్ఛతకు గుర్తు. శాంతికి నిదర్శనం. రంగురంగుల దుస్తులు ఎన్ని ఉన్నా.. పిండివెన్నెలంటి వన్నెతో మెరిసిపోయే తెల్లటి దుస్తుల ముందు అన్నీ దిగదుడుపే! అయితే, తెల్లటి దుస్తులు వేసుకోవడం చాలామందికి ఇష్టమే! కానీ, వాటి నిర్వహణ మాత్రం చికాకు తెప్పిస్తుంది. రవ్వంత దుమ్ము అంటినా.. మరక కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెల్లటి తెలుపు తెల్లబోయేలా చేస్తుంది. పైగా అన్ని దుస్తుల్లానే.. తెల్లటి వస్ర్తాలనూ ఉతికి ఆరేస్తామంటే కుదరదు! మీ చొక్కా తెలుపు మెరుపు కన్నా మెరుగ్గా మెరవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
- నీళ్లలో అరకప్పు వెనిగర్ వేసి దుస్తులను అరగంట నానబెట్టాలి. తర్వాత, డిటర్జెంట్ సోప్‌తో ఉతికితే మంచి రంగు తేలుతుంది. మరకలు ఉన్నచోట వెనిగర్ రాసి, రుద్ది చల్లటినీళ్లలో కాసేపు నానబెట్టి, పిండితే కొత్త డ్రెస్‌లా మారిపోతుంది.
- తెల్లటి దుస్తులను శుభ్రం చేయడంలో బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్‌సోడా వేసిన నీళ్లలో దుస్తులు నానబెట్టి పిండితే.. కొత్తవాటిలా మెరిసిపోతాయి.
- ఆలుగడ్డ రసం మరకలపై రాసి.. 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత యథావిధిగా పిండితే.. డ్రెస్ మీద మరక అడ్రస్ గల్లంతు అవుతుంది.
- వాషింగ్ మెషిన్ ఉపయోగించేవాళ్లు.. తెల్లటి దుస్తులన్నీ ఒకేసారి వేయడం మంచిది. అంతేకాదు, మీ వాషింగ్ మెషిన్‌ను రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేయడం కూడా చాలా అవసరం. లేకపోతే యంత్రంలోని డోమ్ అంచులకు ఉన్న మురికి.. మీ దుస్తులకు అంటుకునే ప్రమాదం ఉంది. ఎక్కువ డిటర్జెంట్ వాడకం కూడా తెల్లటి దుస్తులకు మేలుచేయదని గుర్తుంచుకోండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

