చిన్న తెరే ఇష్టం!
అమ్మ మంజుల. నాన్న విజయ్‌కుమార్. ఇద్దరూ వెండితెర మీద ఓ వెలుగు వెలిగినవారే. కూతురు శ్రీదేవి కూడా ఒకట్రెండు సినిమాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతానికి చిన్న తెరకే పరిమితమైనా.. తనకు పెద్ద ఆలోచనలే ఉన్నట్టున్నాయి. జీ తెలుగు ‘డ్రామా జూనియర్స్' న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్న శ్రీదేవి తన కెరీర్ కబుర్లు చెబుతున్నది.
అమ్మ మంజుల. నాన్న విజయ్‌కుమార్. ఇద్దరూ వెండితెర మీద ఓ వెలుగు వెలిగినవారే. కూతురు శ్రీదేవి కూడా ఒకట్రెండు సినిమాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతానికి చిన్న తెరకే పరిమితమైనా.. తనకు పెద్ద ఆలోచనలే ఉన్నట్టున్నాయి. జీ తెలుగు ‘డ్రామా జూనియర్స్’ న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్న శ్రీదేవి తన కెరీర్ కబుర్లు చెబుతున్నది.
నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాది సినిమా కుటుంబం. అమ్మ మంజుల సుప్రసిద్ధ నటి. నాన్న విజయ్ కుమార్ పెద్ద స్టార్. ఐదేండ్ల వయసులోనే నేను ఓ తమిళ చిత్రంలో కనిపించాను. ఎలా నటించానో, ఎలా డబ్బింగ్ చెప్పానో కూడా గుర్తులేదు. సెట్స్‌లో అందరూ ముద్దు చేసేవారు. చాక్లెట్లు ఇచ్చేవారు. ఇంట్లో ఎలా ఉంటానో, సెట్స్ మీదా అలానే ఉండేదాన్ని. నిజమే, సెలెబ్రిటీల పిల్లలు అనిపించుకోవడంలో లాభాలున్నాయి, నష్టాలూ ఉన్నాయి.
అవకాశాలు త్వరగానే వస్తాయి. కాకపోతే మన మీద ప్రేక్షకులకు మితిమీరిన అంచనాలు ఉంటాయి. తేడా వస్తే పెదవి విరుస్తారు. తెలుగులో తొలి చిత్రంలోనే.. ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చింది. అంతలోనే నా వివాహమైంది. మా ఆయన రాహుల్ చాలా మంచిమనిషి. ఆ తర్వాత కూడా రవితేజ గారితో ఓ సినిమా చేశాను. పాప పుట్టాక కొంత గ్యాప్ తీసుకున్నా. రూపిక నా బంగారు తల్లి! ఎంత అల్లరి చేస్తుందో, అంత బుద్ధిమంతురాలు. తనకిప్పుడు ఆరేండ్లు. బడికెళ్తుంది. దీంతో నాకు తీరిక దొరికింది. అందుకే టీవీ మీద ఫోకస్ చేస్తున్నా. నిజానికి సినిమా కంటే టెలివిజన్‌కే ప్రేక్షకాదరణ ఎక్కువ. కోట్లమంది మనల్ని చూస్తారు. మన పాత్రల్ని ప్రేమిస్తారు. అమ్మలక్కలతో మాట్లాడుతున్నప్పుడు మన డైలాగ్స్ ప్రస్తావిస్తారు. నవ్వుకుంటారు, అప్పుడప్పుడూ తిట్టుకుంటారు.
పిల్లల ప్రపంచం
చిన్నప్పటి నుంచీ నాకు పిల్లలంటే ఇష్టం. జీ తెలుగు ‘డ్రామా జూనియర్స్’ ద్వారా మళ్లీ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇక్కడ అందరూ చిచ్చరపిడుగులే! డైలాగ్స్ కూడా భలేగా గుర్తుపెట్టుకుంటారు. కన్నవాళ్ల ప్రోత్సాహాన్ని అభినందించాల్సిందే. ఆ పసివాళ్లతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నా నుంచి పిల్లలు ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ.. వాళ్ల నుంచి మాత్రం చాలా నేర్చుకున్నాను. మిగతా న్యాయనిర్ణేతలు.. జయప్రద, బాబు మోహన్ నన్ను చిన్నప్పటి నుంచీ చూశారు. దీంతో పార్టిసిపెంట్స్‌తో పాటు నన్నూ చిన్న పిల్లలా చూస్తున్నారు. సెట్స్‌లో ఉన్నంతసేపూ సమయమే తెలియదు. టాలీవుడ్ తారల్లో ప్రభాస్ అంటే ప్రత్యేక అభిమానం. ‘ఈశ్వర్’ రోజుల్లో ఎలా ఉండేవారో ఇప్పుడూ అలానే ఉన్నారు. చాలా మంచి మనిషి. రవితేజ గారూ అంతే. తోటి నటులను గౌరవిస్తారు. అభిమానిస్తారు. పుట్టింది చెన్నైలోనే అయినా.. హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. అమ్మ కారణంగా కావచ్చు, చాలామంది సీనియర్ నటులతో ప్రత్యేక పరిచయాలు ఉన్నాయి. అమ్మ, నాన్న పరిశ్రమకు చెందినవారే అయినా.. షోస్, సినిమాల ఎంపికలో అంతిమ నిర్ణయం నాదే. రాబోయే సినిమాలు, షోల వివరాలు త్వరలో ప్రకటిస్తాను. ‘నలుగురికీ మంచి జరగాలని కోరుకుంటే మనకూ మంచి జరుగు తుంది’ అని నమ్ముతాను. నా స్వచ్ఛమైన నవ్వుకూ అదే కారణం.
-హరిణి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

