‘డిస్నీ-హాట్‌స్టార్’లో తెలుగమ్మాయి

ఇప్పుడు, ఓటీటీ హవా నడుస్తున్నది. ఓటీటీ స్టార్లకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చింది. దిగ్గజ ఓటీటీ సంస్థలన్నీ ఒరిజినల్ మూవీస్, సిరీస్‌లతో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అలా డిస్నీవారి ‘స్పిన్’ అనే ఒరిజినల్ మూవీతో మంచి పేరు సంపాదించుకున్నది పదహారేండ్ల తెలుగమ్మాయి.. అవంతిక
వందనపు. అమెరికాలో పుట్టి పెరిగినా కొన్నేండ్ల క్రితమే బాలనటిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవంతిక. తర్వాత ‘మనమంతా’, ‘ప్రేమమ్’ సినిమాల్లో బాలనటిగా ప్రేక్షకులను మెప్పించింది. తమిళ సినిమా ‘భూమిక’లో ఆటిజంతో బాధపడుతున్న బాలికగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోని ‘స్పిన్’ సినిమాలో డీజే మిక్స్ పట్ల ఆసక్తి ఉన్న అమ్మాయి పాత్రలో నటించింది. క్యాలిఫోర్నియాలో ఉంటూ హోమ్ స్కూలింగ్ ద్వారా పదకొండో తరగతి చదువుతున్న అవంతిక, పలు సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. “ప్రియాంక చోప్రాలానే నేనూ అమెరికాలో వర్ణ వివక్ష ఎదుర్కొన్నాను.
అవమానాలకు గురయ్యాను. నన్ను ‘పాకీ’ అని పిలిచేవారు. ‘నీ దేశానికి వెళ్లిపో’ అంటూ వేధించేవారు. కానీ, దేనికీ నేను బాధపడలేదు. నాకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్, యాక్టింగ్‌లో రాణించి నన్ను నేను నిరూపించుకోవాలని అనుకునేదాన్ని. కూచిపూడి నేర్చుకుంటూ, తెలుగు డ్యాన్స్ షోలలో
పాల్గొన్నాను. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ చేస్తున్నా. తెలుగులో మంచి సినిమాలు చేయాలని ఉంది. ఇటీవలే, ఓ నవల హక్కులు కొనుగోలు చేశాను. త్వరలో సినిమాగా తీసుకొస్తా” అని చెబుతున్నది ఇండో-అమెరికన్ టీనేజర్ అవంతిక.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

