బాహుబలి థాలీ, బాహుబలి దోసె.. ఇప్పుడు ‘బాహుబలి హలీమ్’ కూడా ఆ జాబితాలో చేరింది! హైదరాబాద్ కార్ఖానాలోని గ్రిల్-9 రెస్టారెంట్ నిర్వాహకుల వినూత్న ఆవిష్కరణే ఈ ‘బాహుబలి హలీమ్’. చికెన్ టిక్కా, బాయిల్డ్ ఎగ్, పత్తర్ కా ఘోష్ టాపింగ్తో దీన్ని అందిస్తారు. హలీమ్పై నిమ్మకాయలు, కొత్తిమీర, ఉల్లి పాయలు, జీడిపప్పు, తాజా క్రీమ్తో అలంకరించి ఇస్తారు. నలుగురికి సరిపోయే ‘కింగ్స్ ప్యాక్’ ధర రూ.999 మాత్రమే. ఇద్దరికి అయితే ‘సుప్రీమ్ ప్యాక్’ చాలు. హలీమ్ ప్రియులు ‘బాహుబలి’ని బాగా ఇష్టపడుతున్నారు. ఎక్కడా రాజీపడకుండా హలీమ్ తయారు చేస్తున్నామని చెబుతున్నారు గ్రిల్-9 యజమానులు అహ్మద్, అజ్మత్ ఖాన్. “బాహుబలి-2 విడుదల సమయంలో మా రెస్టారెంట్లో ‘బాహుబలి హలీమ్’ను ప్రారంభించాం. అప్పటినుంచి ప్రతి రంజాన్ సీజన్లోనూ అందిస్తున్నాం” అని వివరించారు అజ్మత్ఖాన్.