ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త…మరో రెండు నెలలు ఆగితే పండండి బిడ్డతో ఆనందంగా జీవించాల్సిన వయస్సు..జీవితాన్ని గురించి ఎన్నెన్నో కలలు కంటున్న ఆ యువతి కలలు ఓ కంటైనర్ రూపంలో కల్లలయ్యాయి. ఇంటిలోకి దూసుకొచ్చిన కంటైనర్ ప్రమాదంలో వెన్నుపూస విరగడంతో ఆమె అచేతనురాలుగా మిగిలింది. అంతే రాత్రికి రాత్రే ఆమె ప్రపంచం మారిపోయింది. అయితేనేం వెన్నెముక విరిగినా ఆమెలోని ఆత్మవిశ్వాసం సడలలేదు. వైకల్యం వెంటాడుతున్న వెనుకడుగువేయలేదు. పట్టువీడవని సంకల్పం.. సాధించాలనే ఆమె తపన ముందు విధి సైతం చిన్నబోయింది. 22 ఏండ్లుగా మంచానికే పరిమితమైనా కష్టాల కడలిలో ఎదురీది తనకంటూ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుంది. గడచిన 22 ఏండ్లుగా మంచాన్నే తన కార్యాలయంగా మార్చుకుంది. సగటు మనిషి చేసే వ్యాపారాలన్నీ తానూ చేస్తోంది హైదరాబాద్ బోరబండ లోని కబీర్ నగర్ కు చెందిన ఛాయదేవి. మరి ఆమె కన్నీటి సుడులను దాటుకొని సంసార నావను అంత చక్కగా ఎలా నడుపగలుగుతుందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..