Lathh Maar Diwali: కర్రలతో కొట్టుకునే దీపావళి పండుగ.. వీడియో
Latth Maar Diwali: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్‌ఖండ్‌లోని జలౌన్ గ్రామస్తులు కూడా ప్రతి ఏడాది లాత్మార్ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు. అంటే దీపావళి నాడు ఆ గ్రామంలో ఒకరినొకరు కర్రలతో

లక్నో: పండుగ ఏదైనా సరే ఆ పండుగను జరుపుకునే తీరులో ప్రాంతాన్ని బట్టి తేడాలుంటాయి. ఆచార వ్యవహారాల్లో కొద్దిపాటి మార్పులు కనిపిస్తాయి. అదేవిధంగా దీపావళి రోజు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. దీపావళిని కొందరు బందీఛోడ్ దివస్‌గా నిర్వహించుకుంటే, మరోచోట లాత్మార్ దీపావళిగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్‌ఖండ్‌లోని జలౌన్ గ్రామస్తులు కూడా ప్రతి ఏడాది లాత్మార్ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు.
అంటే దీపావళి నాడు ఆ గ్రామంలో ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు. ఇవాళ కూడా జలౌన్ గ్రామానికి చెందిన ప్రజలు ఎప్పటిలాగే లాత్మార్ దీపావళి చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే ముందుగా గ్రామస్తులంతా ఒకచోట చేరారు. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి నృత్యాలు చేశారు. ఆపై ఒక గ్రూప్‌పై మరో గ్రూప్ కర్రలతో దాడి చేసుకున్నారు.
కాగా, ఈ లాత్మార్ దీపావళి తాము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్ గ్రామస్తులు తెలిపారు. అయితే, ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారంతా 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులే ఉంటారు. ఇవాళ జలౌన్‌లో జరిగిన లాత్మార్ దీపావళికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | People in Jalaun participate in Bundelkhand's traditional 'Latth Maar Diwali'. #Diwali pic.twitter.com/3F29F0Pgmx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 4, 2021
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

