చాలామంది ఆత్మలుంటాయని నమ్ముతారు. చనిపోయిన వారి ఆత్మలు మనచుట్టే తిరుగుతాయని విశ్వసిస్తుంటారు. కాగా, ఓ మహిళ శరీరం నుంచి ఆత్మ వేరవుతున్న భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. ఈ వీడియోను ‘ఘంటా’ అనే పాపులర్ మీమ్ పేజీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 86వేల లైక్స్‌తో దూసుకుపోతున్నది.
ఈ వీడియోను కామెడీ పర్పస్‌లో ఎడిట్ చేశారు. బ్యాంక్‌గ్రౌండ్‌లో ఒళ్లు గగుర్లుపొడిచే మ్యూజిక్ ప్లే చేశారు. ఈ వీడియోలో ఓ భారతీయ మహిళ ఎర్రచీరలో నేలపై చనిపోయినట్లు పడుకుని ఉంటుంది. కళ్లు పెద్దవిగా తెరిచి ఉంటాయి.
ఒక్కసారిగా ఆ శరీరంలోనుంచి ఆత్మ బయటకు వస్తుంది. ఆ ఆత్మ అచ్చం చనిపోయిన మహిళలాగే ఉంటుంది. మెళ్లగా బాడీలోంచి బయటకు వచ్చి గాల్లో తేలుతుంది. అనంతరం డెడ్ బాడీవైపు చూసి, కెమెరా వైపు కళ్లుతిప్పుతుంది. కెమెరాను చూస్తూ వింతగా నవ్వుతుంటుంది. ఈ వీడియోను ధైర్యమున్నవాళ్లే చూడాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీ ఓన్ రిస్క్‌పైన వీడియో చూడండి అని హెచ్చరికలు జారీచేస్తున్నారు.