Watch: యువకుడి బైక్ స్టంట్… వైరల్ వీడియో క్లిప్‌లో పోలీసుల పంచ్‌లైన్
న్యూఢిల్లీ: ఒక యువకుడు రోడ్డుపై బైక్ స్టంట్ చేశాడు. అయితే నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడ్డాడు. హెల్మెట్ ధరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, రోడ్డు సేఫ్టీ పేరుతో పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చివర్లో ఒక పంచ్‌లైన్ కూడా ఇచ్చారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఒక వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో ఒక యువకుడు ఖాళీ రోడ్డులో బైక్‌పై స్టంట్ చేశాడు. వాహనాల మధ్య వేగంగా దూసుకెళ్లాడు. అయితే రెండు వాహనాల మధ్య నుంచి వెళ్తూ బ్యాలెన్స్ కోల్పోయాడు. ఆ బైక్ ఊగిపోగా అతడు రోడ్డుపై పడ్డాడు. ముందున్న బైక్‌ను ఢీకొనడం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ వ్యక్తి హెల్మెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి బైక్ కూడా రోడ్డుపై కొంత దూరం దొర్లింది.
కాగా, కొన్ని నిమిషాల తర్వాత ఆ వ్యక్తి గాయపడినట్లుగా ఆ వీడియోలో పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి బైక్ స్టంట్ చేసే వాళ్లు ఇలా అవుతారంటూ ఒక ఖాళీ ఫొటో ఫ్రేమ్‌కు పూల దండ వేసి ఉన్న ఫొటోతో పంచ్ లైన్ వేశారు. ‘రోడ్డుపై మీరు అనుకున్నట్లుగా జరుగదు. ఇలాంటి విన్యాసాలు చేస్తే కనెక్ట్ అయ్యే టైలర్ కూడా దొరకడు’ అని పేర్కొన్నారు. స్పీడ్ కిల్స్, రోడ్ సేఫ్టీ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఉంచారు.
మరోవైపు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోడ్ సేఫ్టీపై వినూత్నంగా ప్రచారం చేసి అవగాహన కల్పిస్తున్న పోలీసుల తీరును పలువురు నెటిజన్లు అభినందించారు. ఇలాంటి స్టంట్లు ప్రమాదాలకు దారి తీస్తాయని కొందరు తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ఆ వ్యక్తి బతికిపోయాడంటూ మరికొందరు కామెంట్ చేశారు.
Road par nahi chalegi TUMHARI MARZI,
Aise stunts karoge toh jodne ke liye bhi nahi milega KOI DARZI!#SpeedKills #RoadSafety pic.twitter.com/RFF7MR26Ao— Delhi Traffic Police (@dtptraffic) August 3, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

