Horrific Video | ఫైర్ బ్రీతింగ్ చేయబోయి ముఖం కాల్చుకున్నాడు
Horrific Video | ఒక వ్యక్తి తన నోట్లో మండే స్వభావం కలిగిన కిరోసిన్ లాంటి ఏదైనా ద్రవాన్ని బుక్కపట్టి.. ఒక చేత్తో మంటను పట్టుకుని, ఆ మంటపైకి నోట్లోని ద్రవాన్ని ఊదుతూ గాల్లో అగ్ని గోళాలను సృష్టిస్తుంటాడు.
Horrific Video: ఫైర్ బ్రీతింగ్..! దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక రకమైన సర్కస్ కళ. ఒక వ్యక్తి తన నోట్లో మండే స్వభావం కలిగిన కిరోసిన్ లాంటి ఏదైనా ద్రవాన్ని బుక్కపట్టి.. ఒక చేత్తో మంటను పట్టుకుని, ఆ మంటపైకి నోట్లోని ద్రవాన్ని ఊదుతూ గాల్లో అగ్ని గోళాలను సృష్టిస్తుంటాడు. చూసే ప్రేక్షకులకు ఈ సర్కస్ స్టంట్ కనువిందు చేస్తుంది.
కానీ, ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ స్టంట్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం. ఫైర్ బ్రీతింగ్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఎంత ప్రాక్టీస్ ఉన్నా స్టంట్‌ను ప్రదర్శించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాక ప్రదర్శన ఇస్తున్నంత సేపు ఎంతో ఏకాగ్రతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రిస్క్‌లో పడటం ఖాయం.
ఓ ఫైర్ బ్రీతింగ్ స్టంటర్ అలాంటి పొరపాటే చేశాడు. ఒక కట్టెపుల్లకు బట్టముక్కను చుట్టి కిరోసిన్‌లో ముంచి వెలిగించాడు. ఆ తర్వాత నోట్లో కిరోసిన్‌ను బుక్కపట్టి చేతిలో ఉన్న మంటపై ఉమ్మబోయాడు. ఈ ప్రయత్నంలో చేతిలోని మంటను నోటికి చాలా దగ్గరికి తీసుకురావడంతో నోట్లోని కిరోసిన్ కూడా అంటుకుంది. దాంతో అతని ముఖం అంతా మంటలు వ్యాపించాయి.
వెంటనే చేతిలోని మంటను విసిరేసిన స్టంటర్ తన ముఖంపై మంటలను ఆర్పుకునేందుకు ప్రయత్నించినా కొద్ది మరింత ఎక్కువయ్యాయి. వెంటనే ఆ స్టంట్‌ను చూస్తున్నవాళ్లు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. దాంతో స్టంటర్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ హారిఫిక్ వీడియోను మీరు కూడా ఓసారి చూడండి..
Damn bro 🔥😵 pic.twitter.com/BWzaflUrNO
— Best Videos 🎥🔞 (@_BestVideos) August 8, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

