ఇప్పటిదాకా మనం స్వతహాగా హార్ట్ రేట్‌ను తెలుసుకునేందుకు ఫిట్‌బిట్ లేదా ఆపిల్ వాచ్‌ను వాడుతున్నాం. కానీ ఇప్పడు హార్ట్‌బీట్ పసిగట్టే వస్త్రం వచ్చేసింది. దీన్ని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు.. రోడే ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ సహకారంతో రూపొందించారు. ఈ అధ్యయనం నేచురల్ జర్నల్‌లో ప్రచురితమైంది
ఈ వస్త్రం మైక్రోఫోన్+స్పీకర్లా పనిచేస్తుంది. ఇందులో హార్ట్‌బీట్‌ను కొలిచే పరికరాలుంటాయి. . ఇది మన చెవులలాగా పనిచేస్తుంది. ధ్వనిని మెకానికల్ వైబ్రేషన్లుగా మారుస్తుంది. అలాగే, మైక్రోఫోన్ ఫంక్షన్స్ మాదిరి వైబ్రేషన్లను ఎలక్ట్రిక్ సిగ్నల్‌గా మారుస్తుంది. పరిశోధకులు మానవ చెవి కర్ణభేరినుంచి స్ఫూర్తిపొంది ఈ వస్త్రాన్ని తయారుచేశారు.