Lemon | కొండెక్కిన నిమ్మ ధరలు.. నెల రోజుల్లో 350 శాతం అధికం
వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో తాపాన్ని తగ్గించుకునేందుకు జనం వివిధ రకాల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో రూ.20కి లభ్యమైన అరడజను పెద్దసైజు నిమ్మకాయలు.. ఇప్పుడు రూ.40 వరకు పలుకుతున్నాయి.
- తగ్గిన ఉత్పత్తి, పెరిగిన డిమాండ్
Lemon | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో తాపాన్ని తగ్గించుకునేందుకు జనం వివిధ రకాల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో రూ.20కి లభ్యమైన అరడజను పెద్దసైజు నిమ్మకాయలు.. ఇప్పుడు రూ.40 వరకు పలుకుతున్నాయి. విడిగా అయితే ఒక్కో నిమ్మకాయను రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. నిమ్మసాగు అధికంగా జరిగే కర్ణాటకలో ఈ ఏడాది ఉత్పత్తి దాదాపు 40 శాతం తగ్గింది. దీంతో ఆ రాష్ట్రంలో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి.
నెల రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో రూ.2 వేలు పలికిన 1,000 పెద్దసైజు నిమ్మకాయలకు ఇప్పుడు ఏకంగా రూ.7 వేలకుపైగా చెల్లించాల్సి వస్తున్నది. అంటే ఈ నెల రోజుల్లోనే నిమ్మకాయల ధరలు 350 శాతం పెరిగినట్టు స్పష్టమవుతున్నది. దేశంలో నిమ్మసాగు ఎక్కువగా ఏపీ, కర్ణాటక, తెలంగాణలో జరుగుతుంది. ఏటా ఏపీలో దాదాపు 7, కర్ణాటకలో 3, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చేది. రైతుల నుంచి వీటిని కొనుగోలు చేసిన వ్యాపారులు స్థానికంగా అమ్మడంతోపాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మీదుగా విదేశాలకు ఎగుమతి చేసేవారు. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నిమ్మ దిగుబడి భారీగా తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

