హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తిలో బ్లాస్ట్ ఫర్నేస్ సరికొత్త రికార్డు సృష్టించింది. బ్లాస్ట్ ఫర్నేస్ పని చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 8100 టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. గతంలో ఒక్కరోజులో 8019 టన్నుల ఉత్పత్తి మాత్రమే ఉండేది. సంక్రాంతి తర్వాత ఈ రికా ర్డు నమోదైంది. విశాఖ ఉక్కు కర్మాగారం బ్లాస్ట్ ఫర్నేస్ సిబ్బంది దీనిని సాధించడం ద్వారా మరొకసారి తమ దృఢ సంకల్పాన్ని చాటి చెప్పారు. బీఎఫ్1(గోదావరి బ్లాస్ట్) 1990లో ఉత్పత్తి ప్రారంభించింది. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా పని చేస్తోంది. ప్రారంభం నుంచి బీఎఫ్1లో ఇదే అత్యుత్తమ ఉత్పాదనగా నిలిచింది. దీనిని సాధించినందుకు సిబ్బందిని సీఎండీ అతుల్ భట్ అభినందించారు.