బీజేపీ విధానాలతో దేశ ఐక్యతకు భంగం
- ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి దావలే

బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 26 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మనువాద, హిందు త్వ విధానాల వల్ల దేశ ఐక్యతకు భంగం వాటిల్లుతున్నదని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే ఆరోపించారు. ఆదివారం ఆమె సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. బీజే పీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో హింస, అశాంతి రోజురోజుకు పెరుగుతున్నదని మండిపడ్డారు. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నా మోదీ సర్కార్ నియంత్రించ లేకపోతున్నదన్నారు. దేశానికి సంపదను సృష్టించే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నిస్తున్నదన్నారు. సోమవారం నిర్వహించే భారత్ బంద్కు ఐద్వా పూర్తి మద్దతు తెలుపుతుందని చెప్పారు. సమావేశంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

