నా కుటుంబాన్ని రోడ్డున పడేయద్దు
వేములవాడ మున్సిపల్లో చేసిన సివిల్ పనులకు బిల్లులు చెల్లించాలని ఓ కాంట్రాక్టర్ దండంపెట్టి వేడుకున్న వీడియో గురువారం సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.
- దండం పెడుతున్నా బిల్లు ఇప్పించండి
- వేములవాడలో ఓ కాంట్రాక్టర్ వేడుకోలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
వేములవాడ, అక్టోబర్ 29 : వేములవాడ మున్సిపల్లో చేసిన సివిల్ పనులకు బిల్లులు చెల్లించాలని ఓ కాంట్రాక్టర్ దండంపెట్టి వేడుకున్న వీడియో గురువారం సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ రెండో బైపాస్ రహదారిలో కూరగాయల వ్యాపారుల కోసం ము న్సిపల్ 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.80 లక్షలతో చేపట్టనున్న మారెట్ స్టాళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ బండారి వెంకటేశ్ రూ.60.65 లక్షలతో పనులు దకించుకున్నాడు. 2025 మార్చి 31న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అప్పటి మున్సిపల్ పాలనాధికారితో కలిసి ఆపనులకు శంకుస్థాపన చేశా రు. సదరు కాంట్రాక్టర్ 40 శాతం పనులు పూర్తిచేసిన తర్వాత రూ.27 లక్షల ట్రెజరీ చెకును నిరుడు సెప్టెంబర్‌లో అందజేశారు.
చెకు ఇచ్చినప్పటికీ నగదు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ము న్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వ గా తాను పనులు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, బిల్లులు చెల్లిస్తే పూ ర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు. కానీ అధికారులు మాత్రం కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన నగదును పైఅధికారులమీద నెట్టివేసి, పనులు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో కాంట్రాక్టర్ బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించాడు. కేసు ఉండగానే పాలకవర్గం వెంకటేశ్ చేపట్టిన ప నులను రద్దుచేశారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్ గురువారం ఓ వీడియో విడుదల చేశాడు. తనకు బకాయిలను చెల్లించిన త ర్వాతే పనులను రద్దు చేయాలని వేడుకుం టూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్‌కు వీడియో పంపాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

