హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు విజిటర్స్ అవార్డు

- త్వరలోనే రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ అనునయ్ సామంత ప్రతిష్ఠాత్మక విజిటర్స్ అవార్డు -2020కి ఎంపికయ్యారు. ఫిజికల్ సైన్సెస్‌లో ‘అల్ట్రాఫాస్ట్ అండ్ సింగిల్ మాలిక్యూల్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం దక్కింది. అవార్డుతోపాటు నగదు పారితోషికాన్ని ప్రొఫెసర్‌కు త్వరలోనే ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ప్రదానం చేయనున్నట్టు హెచ్‌సీయూ తెలిపింది. ఈ సందర్భంగా అనునయ్ సామంతకు వైస్ చాన్స్‌లర్ అరుణ్ అగర్వాల్ అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

