Ugadi Panchangam 2023 | శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే?
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు తెలుసుకునే కార్యక్రమం పంచాగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు.
చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగు వారి మొదటి పండుగ.. ఉగాది. ఇది వసంత కాలపు వేడుక. గత ప్రళయం పూర్తయిన తర్వాత.. బ్రహ్మ సృష్టిని తిరిగి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలో మొదట వచ్చే యుగాదినే.. యుగానికి ఆదిగా ‘ఉగాది’ అని వ్యవహరిస్తారు. ఉగాది పండుగ రోజున షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని ప్రార్థిస్తారు. ఇష్టంగా ఉగాది పచ్చడి తింటారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు తెలుసుకునే కార్యక్రమం పంచాగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు.
మనం ఇప్పుడు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నుంచి శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. శోభకృత్ అంటే శోభ కలిగించేది అని అర్థం. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ ప్రతి జీవికీ చైతన్యంతో కూడిన ఆనందాన్నిస్తుంది. మనిషి ఆశావాది. మార్పు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ దిశగా తొలి అడుగే ఉగాది. కొత్తదనానికి శ్రీకారం, కొత్త వత్సరానికి ప్రారంభం. విజయాలను మూటగట్టి ఇచ్చే ఏడాదిలోకి అడుగు పెడుతున్నామిప్పుడు. మరి ఈ ఏడాది పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతున్నదని, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయని శ్రీమతి లతా జంధ్యాల వివరిస్తున్నారు. పూర్తి వీడియోను నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్లో చూడవచ్చు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

