కొత్తూరు : జంతువుల్లో ఆవులు, గెదేలు ఈతకు ఒక లేగ దూడకు మాత్రమే జన్మనిస్తాయి. కానీ ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసిన సంఘటన కొత్తూరు తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే తండాకు చెందిన నాయక్ అనే రైతుకు ఆవులు ఉన్నాయి. అందులో ఒక ఆవు శనివారం రెండు లేగ దూడలకు జన్మనిచ్చింది. దీంతో నాయక్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. రెండు లేగ దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపాడు. విషయం తెలుసుకున్న తండావాసులే కాకుండా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామల నుంచి రైతులు వచ్చి చూసి పోతున్నారని తెలిపారు.