ఆర్కే-7 గని నార్త్‌లో ఉత్పత్తి నిలిపివేత
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది.
- డిప్యూటేషన్లపై 300 మంది కార్మికుల బదిలీ
శ్రీరాంపూర్, జూలై 13 : శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. 2019 నుంచి గని విస్తరణకు అనుమతి కోసం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ డైరెక్టర్ జనరల్‌కు సింగరేణి యాజమాన్యం నాలుగుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ తిరస్కరించినట్టు తెలిసింది.
అనుమతి వచ్చే వరకు ఉత్పత్తి నిలిపివేయాలని అధికారులు శనివారం ఆదేశించినట్టు సమాచారం. నార్త్ పని స్థలాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 300 మంది ఉద్యోగులను ఇతర గనులకు తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై బదిలీ చేయనున్నారు. నెల రోజుల్లో తిరిగి బొగ్గు ఉత్పత్తికి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నదని, అప్పుడు తిరిగి కార్మికులను ఆర్కే-7గనికి తీసుకుంటామని జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. అనుమతులివ్వడంలో కేంద్రం జాప్యం సరికాదని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి అన్నారు. డిప్యూటేషన్‌పై బదిలీ చేయడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

