హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య (Acharya) మూవీ ప్రీ రిలిజ్ వేడుక జరుగనుంది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో టీఎస్పీఎస్పీ 1వ బెటాలియన్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం వేడుక జరుగనుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేయడం లేదా మళ్లించడం జరుగుతుందని తెలిపారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తామని చెప్పారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
మైత్రీవనం నుంచి వచ్చేవాహనాలను యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపునకు అనుమతించరు. సవేరా ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్‌నగర్ వైపు, సత్యసాయి నిగమాగమం, కమలాపురి వైపు పంపుతారు. జూబ్లీహిల్స్ నుంచి అమీర్‌పేట వైపునకు వచ్చే వాహనాలను శ్రీనగర్ కాలనీ నుంచి సత్యసాయి నిగమాగమం వైపు మళ్లిస్తారు.