బిగ్‌బీ గొంతుకతో పర్యాటక ప్రచారం

- వీడియోకు అమితాబ్‌బచ్చన్ వాయిస్
- వెబ్‌సైట్‌నూ ఆధునీకరిస్తున్న టీఎస్‌టీడీసీ
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘అదిగో గోల్కొండ.. లక్నవరం, రంగనాయకసాగర్ అందాలు ఆస్వాదించు.. సోమశిలలో ప్రకృతి సోయగాలు చూడు.. రామప్ప గొప్పతనం వీక్షించు.. ఇదీ చార్మినార్, బిర్లామందిర్ చరిత’ అంటూ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ గళం వినిపించనున్నది. రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అదేస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై 15 నిమిషాల నిడివిగల వీడియోను విడుదలచేసేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఈ వీడియోలో చూపిస్తూ వాటి చారిత్రక నేపథ్యాన్ని బిగ్‌బీ గొంతుకతో వివరించనున్నది. గంభీరమైన ఆయన వాయిస్ ఓవర్‌తో ఆకట్టుకునేలా వీడియోను తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. టీఎస్‌టీడీసీ వెబ్‌సైట్‌ను సైతం ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతతో యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా, ఒక్క క్లిక్‌తో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సమస్త సమాచారం తెలుసుకునేలా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

