ఆర్టీసీ గుర్తింపు సంఘాలకు ప్రత్యేక సౌకర్యాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు యాజమాన్యం పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- యూనియన్లకు నిధుల వసూలు నుంచి సమావేశాల వరకు వెసులుబాటు
- విధులకు ఆటంకం కలిగిస్తే గుర్తింపు రద్దు: ఆర్టీసీ
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు యాజమాన్యం పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు పొందిన యూనియన్లు సభ్యత్వ రుసుము వసూలు చేసుకోవడం, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయడం, గేట్ మీటింగ్‌లు నిర్వహించడం, యాజమాన్యంతో నిర్దిష్ట వ్యవధిలో సంయుక్త సమావేశాలు జరుపడంవంటి వెసులుబాట్లు కల్పిస్తూ సంస్థ ఎండీ సర్యులర్ జారీ చేశారు. క్లాజ్-3 కింద జరిగిన రాష్ట్రస్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ను రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంగా నిర్ధారిస్తూ గుర్తింపును ఇచ్చారు.
అలాగే జిల్లా స్థాయిలో జరిగిన క్లాజ్-6 ఎన్నికల్లో మూడు సంఘాలకు గుర్తింపునిచ్చారు. వీటిల్లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు సికింద్రాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఆపరేషనల్ రీజియన్లలో గుర్తింపునిచ్చారు. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్‌కు ఖమ్మం, నల్లగొండ రీజియన్లలో, తెలంగాణ ఆర్టీసీ వరర్స్ యూనియన్‌కు మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి రీజియన్లతోపాటు నాన్ ఆపరేషనల్ రీజియన్లలో హెడ్ఆఫీస్, కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్లలో ప్రాతినిధ్యం కల్పించారు. ఈ గుర్తింపు 2026 అక్టోబర్ 17 నుంచి రెండేండ్లపాటు అమల్లో ఉంటుంది.
3 రోజులపాటు రుసుము వసూలు
గుర్తింపు పొందిన సంఘాలు వేతనాలు జమయిన తేదీ నుంచి మూడు రోజులపాటు సంస్థ ప్రాంగణాల్లో సభ్యత్వ రుసుము వసూలు చేసుకోవచ్చు. ఇందుకు యూనిట్ అధికారి స్థలాన్ని కేటాయిస్తారు. ఒకో సంఘం నుంచి సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు ప్రతినిధులు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొనాలి. క్లాజ్-3 గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్‌తో జోనల్ స్థాయిలో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. క్లాజ్-6 కింద గుర్తింపు పొందిన సంఘాలతో డిపో స్థాయిలో ప్రతి నెల మూడో మంగళవారం సమావేశాలు నిర్వహించాలి. విధులకు ఆటంకం కలిగిస్తే గుర్తింపు రద్దు చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టంచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

