తెలంగాణకే ఏపీ రూ. 4,457 కోట్ల బాకీ
Telangana Transco | తెలంగాణ నుంచి తమకు రావాల్సిన బాకీలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బకాయిలపై తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్

హైదరాబాద్ : తెలంగాణ నుంచి తమకు రావాల్సిన బాకీలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బకాయిలపై తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలే తెలంగాణకు బాకీ ఉన్నాయి. తెలంగాణకు ఏపీ రూ. 4,457 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ బకాయిలు ఇప్పించాలంటూ నిన్న హైకోర్టులో ఏపీ పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ చెల్లించాల్సిన బకాయిల గురించి మాత్రం మాట్లాడట్లేదు. ఉమ్మడి ఏపీలో తీసుకున్న రుణాలను తెలంగాణ చెల్లిస్తోంది. తెలంగాణ రూ. 2,725 కోట్లను చెల్లిస్తోంది. ఏపీ జెన్కో వాటాల విభజనలో తెలంగాణకు నిధులు రావాలి. కృష్ణపట్నం ప్లాంట్‌లో తెలంగాణ డిస్కంల పెట్టిన పెట్టుబడి సొమ్ము వడ్డీతో సహా రూ. 1,611 కోట్లు రావాలి. బకాయిలన్నీ కలిపి లెక్కిస్తే తెలంగాణకే ఏపీ బాకీ ఉంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకే రూ. 4,457 కోట్లు చెల్లించాలి. తెలంగాణకు రావాల్సిన బకాయిలపై ఏపీ స్పందించట్లేదు. తెలంగాణ వాదనలను హైకోర్టుకు వివరిస్తాం అని సీఎండీ ప్రభాకర్ రావు తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

