Minister KTR | త్వరలో హైదరాబాద్‌లోనే ఐఫోన్ల తయారీ.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫాక్స్‌కాన్ కంపెనీ భూమిపూజ
Minister KTR | తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రేపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
హైదరాబాద్: తైవాన్‌కు చెందిన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ నిర్మాణానికి రేపు ఉదయం పదిన్నర గంటలకు భూమిపూజ చేయనున్నారు. రూ.1,656 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్‌కాన్ కంపెనీ నిర్మాణం చేపడుతున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే సుమారు 35 వేల మందికిపైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఫాక్స్‌కాన్ సంస్థ అందుకు అంగీకరించింది. దాంతో రాష్ట్ర సర్కారు కంపెనీ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్ సంస్థకు 196 ఎకరాల భూమిని కేటాయించింది.
కాగా, రేపు కంపెనీ భూమిపూజకు మంత్రి కేటీఆర్ హాజరవుతుండటంతో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రేపటి భూమిపూజకు సంబంధించిన విషయాలపై వారితో చర్చించారు. కంపెనీ ప్రాంగణంలో నిర్మించబోయే రోడ్లు, ఇతర భవనాల మ్యాప్‌లను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు, ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ గ్రూప్ ఛైర్మన్ యంగ్ ల్యూ తోపాటు మంత్రి సబితా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్. సుమారు 70శాతం యాపిల్ ఐఫోన్లు ఫాక్స్‌కాన్ కంపెనీయే తయారు చేస్తుండడం గమనార్హం. యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

