ఆగస్టు నుంచే విద్యుత్తు లోటు.. రాష్ర్టాన్ని ముందే హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
విద్యుత్తు కోతలతో రాష్ట్రం అల్లాడుతున్నది. రైతాంగం గగ్గోలు పెడుతున్నది. ఈ సమస్య ఒకసారిగా తెరపైకి వచ్చింది కాదు. ఆగస్టు నుంచే రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అప్పట్లోనే రాష్ట్రంలో విద్యుత్తు లోటు ఏర్పడింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరించింది.
- దిద్దుబాటు చర్యలు చేపట్టని కాంగ్రెస్ సర్కార్
- ఫలితమే కరెంటు కటకట.. అప్రకటిత కోత
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు కోతలతో రాష్ట్రం అల్లాడుతున్నది. రైతాంగం గగ్గోలు పెడుతున్నది. ఈ సమస్య ఒకసారిగా తెరపైకి వచ్చింది కాదు. ఆగస్టు నుంచే రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అప్పట్లోనే రాష్ట్రంలో విద్యుత్తు లోటు ఏర్పడింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరించింది. ఆగస్టులో రెండు మిలియన్ యూనిట్లు, మూడు మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడిందని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రం హెచ్చరించినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మేల్కొనలేదు. అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఫలితంగా పరిస్థితి విషమించింది. విద్యుత్తు లోటు అధికమైంది. విద్యుత్తు కోతలు పెరిగాయి. ఆగస్టు నుంచే విద్యుత్తు సరఫరా, డిమాండ్ మధ్య అంతరం నమోదైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం పట్ల విద్యుత్తురంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రస్తుతం విద్యుత్తు కోతల సమస్య ఎదురవుతున్నదని, ఇవి కాంగ్రెస్ తెచ్చిన కోతలేనని అభివర్ణిస్తున్నారు.
డిమాండ్‌కు తగ్గ సరఫరా ఏదీ?
ఆగస్టులో రాష్ర్టానికి 8,939 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం కాగా, ప్రభుత్వం 8,937 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే అందించింది. అంటే, రెండు మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ (పీక్ డిమాండ్) 17,291 మెగావాట్లకు చేరగా, 17,288 మెగావాట్ల మేర మాత్రమే సరఫరా చేసినట్టు కేంద్ర విద్యుత్తు శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పీక్ డిమాండ్ సమయంలోనూ మూడు మెగావాట్ల అంతరం కనిపించింది. ఆగస్టులోనే లోటు ఏర్పడితే భవిష్యత్తులో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం..అదనపు విద్యత్తు కొనుగోళ్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయింది.
ఇతర రాష్ట్రాల్లో లోటు లేకుండా..
విద్యుత్తు లోటు అన్ని రాష్ర్టాల్లోనూ ఉన్నదని కాంగ్రెస్ పాలకులు చెప్తున్నారు. కానీ, వివిధ రాష్ట్రాలు డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తును అందిస్తున్నాయి.కోతలు లేకుండా చూసుకుంటున్నాయి. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, మణిపూర్, సిక్కిం, ఒడిశా, మేఘాలయ, త్రిపుర, పశ్చిమబెంగాల్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ర్టాలు ఆగస్టులో తగినవిధంగా విద్యుత్తును సరఫరా చేశాయి. వీటిలో మన కంటే పెద్దవైన మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విద్యుత్తు లోటు నమోదు కాకపోవడం గమనార్హం. విద్యుత్తు విషయంలో ఒక్క తెలంగాణే కాదు.. కాంగ్రెస్‌పాలిత కేరళ కూడా వెనుకబడింది. కేరళ పీక్ డిమాండ్ ఆగస్టులో 4,913 మెగావాట్లు ఉంటే, ఆ రాష్ట్రం 4,861 మెగావాట్లు మాత్రమే అందించింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

