DSPs Transfers | రాష్ట్రవ్యాప్తంగా 26 మంది డీఎస్పీల బదిలీలు !
DSP Transfers | రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజినీ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
DSPs Transfers | రాష్ట్రవ్యాప్తంగా 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా పని చేస్తున్న వీ జైపాల్ రెడ్డిని ఖాళీగా ఉన్న చిలకలగూడ ఏసీపీగా నియమించారు. సివిల్ డీఎస్పీగా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న బాలగంగిరెడ్డిని సుల్తాన్ బజార్ ఏసీపీగా బదిలీ చేశారు. సుల్తాన్ బజార్ ఏసీపీగా పని చేస్తున్న పీ దేవేందర్ ను.. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ ఏసీపీగా పని చేస్తున్న నరేందర్ గోపథిని, కరీంనగర్ రూరల్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీగా పని చేస్తున్న టీ కరుణాకర్ రావును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం గద్వాల్ ఎస్డీపీఓగా పని చేస్తున్న ఎన్సీ రంగస్వామిని ఖాళీగా ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ షాద్ నగర్ ఏసీపీగా నియమించారు. డీఎస్పీగా పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న కట్టా హరిప్రసాద్ ను జుబ్లీ హిల్స్ ఏసీపీగా నియమించారు.
సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ ఏసీపీగా పని చేస్తున్న వీ భాస్కర్‌ను.. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నిర్మల్ ఎస్డీపీఓగా పని చేస్తున్న ఎల్ జీవన్ రెడ్డిని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ హుజూరాబాద్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ డీఎస్పీగా పని చేస్తున్న కే వెంకట్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రామగుండం ఎస్బీ ఏసీపీగా పని చేస్తున్న మోహన్ బాలుసానిని రామగుండంలోని జైపూర్ ఏసీపీగా నియమించారు. పోస్టింగ్ కోసం వెయింటింగ్ లో ఉన్న సివిల్ డీఎస్పీ పొనుగంటి రామ్ చందర్ రావును సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ ఏసీపీగా నియమించారు.
వరంగల్ లోని ఖాజీపేట ఏసీపీగా ఉన్న పద్మనాభుల శ్రీనివాస్ ను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ఏసీపీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న డీఎస్పీ సీహెచ్ రఘునందనరావును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సీఐడీ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీఎస్పీగా ఉన్న రావుల శేఖర్ రెడ్డిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ డీఎస్పీగా పని చేస్తున్న శ్రీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న కే శంకరయ్యను నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్డీపీఓగా నియమించారు. అక్కడ పని చేస్తున్న జీ గిరిబాబును నల్లగొండ జిల్లా దేవరకొండ ఎస్డీపీఓగా ట్రాన్స్ ఫర్ చేశారు. దేవరకొండ ఎస్డీపీఓగా ఉన్న ఎం నాగేశ్వరరావును కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్డీపీఓగా నియమించారు. అక్కడ డీఎస్పీగా పని చేస్తున్న ఎం నాగేశ్వరరావును హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం వెయింటింగ్ లో ఉన్న డీఎస్పీ (సివిల్) తాళ్లపెల్లి సత్యనారాయణను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్డీపీఓగా నియమించారు. అక్కడ పని చేస్తున్న ఏ శ్రీనివాసులును హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీగా పని చేస్తున్న ఏ గంగారెడ్డిని నిర్మల్ ఎస్డీపీఓగా నియమించారు. నిర్మల్ ఎస్డీపీఓగా పని చేస్తున్న ఎల్ జీవన్ రెడ్డిని ట్రాన్స్ ఫర్ చేశారు.
ఇంటెలిజెన్స్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కొనం నర్సింహులును ప్రస్తుతం ఖాళీగా ఉన్న వికారాబాద్ ఎస్డీపీఓగా ట్రాన్స్ ఫర్ చేశారు. కరీంనగర్ ట్రాఫిక్-2 ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న టీ సత్యనారాయణను ప్రస్తుతం ఖాళీగా ఉన్న మహబూబాబాద్ ఎస్డీపీఓగా నియమించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ టౌన్ ఏసీపీ టీ శ్రీనివాసరావును రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి ఖని ఏసీపీగా నియమించారు. గోదావరి ఖని ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న సేరి గిరి ప్రసాద్ ను హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

