ఎయిర్‌పోర్టు మెట్రో పనుల సర్వే షురూ
ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు సర్వే పనులు ఐటీ కారిడార్‌లోని రాయదుర్గంలో మొదలయ్యాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండు ఇంజినీరింగ్ బృందాలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
- రెండు ఇంజినీరింగ్ బృందాలతో పరిశీలన
- మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పలు సూచనలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు సర్వే పనులు ఐటీ కారిడార్‌లోని రాయదుర్గంలో మొదలయ్యాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండు ఇంజినీరింగ్ బృందాలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. మొదట రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా ఐకియా, అరబిందో గెలాక్సీ ప్రాంతాల నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నార్సింగి వరకు 10 కిలోమీటర్ల మార్గాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా అలైన్మెంట్ ఖరారు, గ్రౌండ్ డాటా సేకరణ పనులు చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డాటా కీలకమవుతుందని తెలిపారు. ఈ కారిడార్ కేవలం విమానాశ్రయ ప్రయాణికులకే కాకుండా ఈ ప్రాంతవాసులకు, ముఖ్యంగా నగర శివార్లలో నివాసముండే తకువ ఆదాయ వర్గాల వారందరికీ కూడా ఉపయోగపడేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ఎండీ వివరించారు. సర్వే బృందంలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బీ ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు ఎం విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఇతర సీనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

