కాంగ్రెస్ సర్కార్‌కు ‘సుప్రీం’ షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుకతవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేను తొలగించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
- సీతమ్మసాగర్ ఇసుకతవ్వకాలపై స్టే తొలగింపునకు నిరాకరణ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుకతవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేను తొలగించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారాన్ని ఎన్జీటీలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతమ్మసాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టు వల్ల ములుగు జిల్లాలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపునకు గురవుతుందని అధికారులు అంచనా వేయడంతో ముంపు ప్రాంతంలో గోదావరి నుంచి 42,95,394 క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ ఏప్రిల్ 25న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులపై రాములు తదితరులు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జస్టిస్ పుష్ప సత్యనారాయణ నేతృత్వంలోని ఎన్జీటీ సౌత్ జోన్ ధర్మాసనం బాధ్యులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో తాత్కాలిక స్టేను తుది ఉత్తర్వులు వెలువడేవరకు పొడిగించింది. దీంతో ఎన్జీటీ విధించిన స్టే ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన చీఫ్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

