ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జర్నలిస్టుల హక్కు
ప్రశ్నించే జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
- తప్పుడు వార్తలు వస్తే సవరణలు కోరాలేగానీ దాడులు హేయం
- మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సులో పలువురు వక్తలు
- ఏజేయూ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో ఘనంగా ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రశ్నించే జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీడియాకు లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని అన్నారు. ప్రశ్నలను అణచివేయడంలో కాదని, వాటికి సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య బలం ఉన్నదని పేర్కొన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సు జరిగింది.
‘వాయిసెస్ ఫర్ ఏ బెటర్ టుమారో’ ప్రధాన ఇతివృత్తంగా ఈ సమావేశం నిర్వహించారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ సదస్సులో మొదటిరోజు మీడియా రంగంలో జర్నలిస్టు సంఘాల పునర్నిర్మాణం, మహిళా జర్నలిస్టుల భద్రత-సవాళ్లు, స్కిల్ అప్డేట్, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం, సమాన అవకాశాలు, వేధింపులు-రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చలు కొనసాగాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కవర్ చేసిన మహిళా జర్నలిస్టులపై దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర ఆందోళనకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వసనీయత కోల్పోతే నిలదొక్కుకోవడం అసాధ్యం: జస్టిస్ రాధారాణి
మీడియా స్వేచ్ఛపై ఎటువంటి దాడి జరిగినా ఖండించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జీ రాధారాణి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా మీడియా రంగంలోని అన్ని విభాగాల్లో మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారని, అయితే నిర్ణయాధికారాల్లో మాత్రం వారి సంఖ్య అత్యల్పంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. విశ్వసనీయత లేని వార్తలను సెన్షేషన్ కోసం ప్రచురించి, ప్రసారం చేసి ప్రజలకు తప్పుడు వార్తలు అందించే ధోరణీ ఇటీవల పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఒక్కసారి మీడియా, పత్రిక విశ్వసనీయత కోల్పోతే మళ్లీ నిలదొక్కుకోవడం సాధ్యం కాదని చెప్పారు. తప్పుడు వార్తలు వచ్చినప్పుడు చట్టపరమైన పరిష్కారాలు, సవరణలు కోరాలని, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను బెదిరించడం సరైంది కాదని చెప్పారు. మహిళా జర్నలిస్టుల భద్రత కోసం మీడియా సంస్థలు పటిష్ట వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐజేయూ ప్రెసిడెంట్ బల్విందర్‌సింగ్ మాట్లాడుతూ.. దేశంలో మహిళా జర్నలిస్టులపై దాడులు పెరుగుతుండటం బాధాకరమని అన్నారు.
ప్రపంచాన్ని మేల్కొలుపుతున్న జర్నలిస్టులు: సీపీ సుమతి
మహిళా నాయకత్వం అంటే కేవలం ఒక పదవి కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగే నిరంతర ప్రయాణమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. ప్రపంచాన్ని మేల్కొల్పడంలో జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. కర్ణాటక మీడియా అకాడమీ చైర్పర్సన్ అయేషా ఖానుమ్ మాట్లాడుతూ.. జర్నలిజం రంగంలో మహిళల సంఖ్య పెరుగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జర్నలిస్టుల హక్కు
Farmer | అన్నదాతపై పోలీసుల దౌర్జన్యం.. భూమి పరిహారం అడిగినందుకు రైతు నర్సింహులుపై దాడి
బియ్యం రేటులో రైతుకు దక్కిందెంత?!
Gajwel | ఏం పీకనీకి ఎవుసం చేస్తున్నవ్.. పోలీస్‌స్టేషన్‌లో రైతుపై ఎస్సై దాష్టీకం
Rayadurgam | సర్కార్ భూములపై గద్దల్లా పెద్దలు.. రాయదుర్గంలో వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

